Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. హోమ్లీ బ్యూటీ నిత్యా మీనన్, యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2021 జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.
అయితే తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాకి రన్ టైమ్ లాక్ చేశారు. సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఇతర పాటలు కూడా మూడు ఉన్నాయి. దాంతో సినిమా రన్ టైం ఎక్కువ వచ్చింది. ఎంతో ఖర్చు పెట్టి తీసిన పాటలను తీసేయడం మేకర్స్ కి ఇష్టం లేదు. అందుకే, కొన్ని సీన్స్ ను తీసేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో అసలు సినిమాలో అనవసర సన్నివేశాలు ఏమి ఉన్నాయో వెతికి మరీ వాటిని తీసేస్తున్నారు. మొత్తానికి సినిమాని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కేవలం 2 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారట. అవసరం అనుకుంటే మరో పది నిమిషాల సినిమాను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. ఎందుకంటే.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే త్రివిక్రమే.
ఎంతైనా మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు ప్లే మీద, మాటల మీద మంచి పట్టు ఉంది. అందుకే, పవన్ కూడా త్రివిక్రమ్ ఏమి చెబితే.. దానికి ఓటు వేస్తున్నాడు. ఆ కారణంగా ఈ సినిమా విషయంలో ప్రతిదీ త్రివిక్రమ్ మాట మీదే నడుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
Also Read: Nithya Menen: త్రివిక్రమ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్.. ఎప్పుడు అలా చూస్తారంటూ..!
అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ కు పోటీగా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఆ సినిమాలతో పోల్చుకుంటే ‘భీమ్లా నాయక్’ సినిమా రేంజ్ తక్కువే. మరి సంక్రాంతి పోటీలో ‘భీమ్లా నాయక్’ ఏ స్థాయిలో నెగ్గుతాడో చూడాలి.
Also Read: NTR Mother: ఆ విషయంలో ఎన్టీఆర్ ను హెచ్చరించిన తల్లి.. అలాంటివి సినిమాలోనే జరుగుతాయంటూ!