https://oktelugu.com/

Actress Purna: “జై బాలయ్య” అంటూ అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసిన హీరోయిన్ పూర్ణ

Actress Purna: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూవీ “ఆఖండ”. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా… ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో అదరగొట్టారు. అలానే జగపతిబాబు, పూర్ణ, తదితరులు నటించారు. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిత్ర […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 11:40 AM IST
    Follow us on

    Actress Purna: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూవీ “ఆఖండ”. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా… ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో అదరగొట్టారు. అలానే జగపతిబాబు, పూర్ణ, తదితరులు నటించారు. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిత్ర బృందం… ప్రస్తుతం విజయోత్సవ జాతర కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు నిన్న వైజాగ్‌లో ఏర్పాటు చేసిన అఖండ విజయోత్సవ జాతర కార్యక్రమంలో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.

    Actress Purna

    Also Read: “డిటెక్టివ్ సత్యభామ” గా రానున్న సోనియా అగర్వాల్…

    ఈ మేరకు అఖండ విజయోత్సవ సభకు హాజరైన పూర్ణ… బాలయ్య బాబును ప్రశంసల్లో ముంచెత్తారు. సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన బోయపాటికి ధన్యవాదాలు తెలుపుతూనే బాలయ్యతో నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదని అన్నారు. శ్రీకాంత్ గారు తనను ఎంత భయపెట్టినా బాలయ్య అందం ముందు అదేమీ తనకు పట్టలేదన్నారు. అంతటితో ఆగని పూర్ణ… ఏకంగా బాలయ్యకు అందరి ముందే సాష్టాంగ నమస్కారం చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాలోని అఘోర పాత్ర నన్ను ఇంకా వెంటాడుతునే ఉందని తెలిపింది. అయితే హీరోయిన్ పూర్ణ సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ ల దిశగా దూసుకుపోతుంది.

    Also Read: సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన నటి జెనీలియా…