Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak Collections: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్ల టార్గెట్ ఖతం..

Bheemla Nayak Collections: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్ల టార్గెట్ ఖతం..

Bheemla Nayak Collections:  తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలి విశ్వవ్యాప్తం చేసింది. కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమాల మార్కెట్ దేశవ్యాప్తమైంది. దానికిప్పుడు కరోనా కల్లోలం తర్వాత గట్టి ఊపు నిచ్చాడు ‘పవన్ కళ్యాణ్’. ‘భీమ్లానాయక్’ సినిమాతో టాలీవుడ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు.

Bheemla Nayak Collections
Bheemla Nayak Collections

భీమ్లానాయక్ మూవీకి తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ స్టైల్ యాక్టింగ్ తో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాన్ బేస్ ను భీమ్లానాయక్ మూవీ మరింత విస్తృతం చేసుకుంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తున్నాయి.

Also Read:  ‘రష్మిక మందన్నా’ పెళ్లి పై కొత్త పుకార్లు

తాజాగా భీమ్లానాయక్ మూవీ అయితే సంచలన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతోంది. అక్కడి అదిరిపోయే రికార్డులను సాధిస్తోంది.

మూడో రోజు ఏరియాల ప‌రంగా చూస్తే నైజాంలో రూ.6.55 కోట్లు, సీడెడ్ లో రూ.2.2 కోట్లు, అలాగే నెల్లూరులో రూ.0.41కోట్లు, గుంటూరులో రూ.0.72 కోట్లు, తూర్పు గోదావ‌రిలో రూ. 0.47 కోట్లు, ప‌శ్చిమ గోదావ‌రిలో రూ.0.91 కోట్లు వ‌సూల‌య్యాయి. మొత్తంగా తెలంగాణ‌, ఆంధ్రాలో క‌లిపి చూస్తే మూడో రోజు రూ.13.15 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది ఈ మూవీ.

Bheemla Nayak Collections
Pawan Kalyan Bheemla Nayak

ఈ మూడు రోజుల‌కు క‌లిపి గ్రాస్ క‌లెక్ష‌న్లు చూసుకుంటే.. ఆంధ్ర‌, తెలంగాణ, క‌ర్నాట‌క‌, రెస్టాఫ్ ఇండియాను క‌లుపుకుని రూ.89.40 కోట్లు వ‌చ్చాయి. అటు ఓవ‌ర్ సీస్ లో ఈ మూడు రోజులో రూ.20.60 కోట్లు వ‌సూలు చేసింది భీమ్లానాయ‌క్‌. మొత్తం రూ.110 కోట్లు ఇప్ప‌టి వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్న‌ల‌ను భీమ్లా నాయక్ రాబ‌ట్టాడు.

ఇక ఈ వారం బుకింగ్స్ ను చూస్తే ఖచ్చితంగా మూవీ 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఊపు ఈ వారం అంతా కంటిన్యూ అయితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులను పవన్ బద్దలు కొట్టేస్తాడు. ఓవరాల్ గా 500 కోట్ల కలెక్షన్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Also Read:  టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version