Bheemla Nayak Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలి విశ్వవ్యాప్తం చేసింది. కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమాల మార్కెట్ దేశవ్యాప్తమైంది. దానికిప్పుడు కరోనా కల్లోలం తర్వాత గట్టి ఊపు నిచ్చాడు ‘పవన్ కళ్యాణ్’. ‘భీమ్లానాయక్’ సినిమాతో టాలీవుడ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు.
భీమ్లానాయక్ మూవీకి తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ స్టైల్ యాక్టింగ్ తో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాన్ బేస్ ను భీమ్లానాయక్ మూవీ మరింత విస్తృతం చేసుకుంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తున్నాయి.
Also Read: ‘రష్మిక మందన్నా’ పెళ్లి పై కొత్త పుకార్లు
తాజాగా భీమ్లానాయక్ మూవీ అయితే సంచలన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతోంది. అక్కడి అదిరిపోయే రికార్డులను సాధిస్తోంది.
మూడో రోజు ఏరియాల పరంగా చూస్తే నైజాంలో రూ.6.55 కోట్లు, సీడెడ్ లో రూ.2.2 కోట్లు, అలాగే నెల్లూరులో రూ.0.41కోట్లు, గుంటూరులో రూ.0.72 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 0.47 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.0.91 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా తెలంగాణ, ఆంధ్రాలో కలిపి చూస్తే మూడో రోజు రూ.13.15 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ మూవీ.
ఈ మూడు రోజులకు కలిపి గ్రాస్ కలెక్షన్లు చూసుకుంటే.. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, రెస్టాఫ్ ఇండియాను కలుపుకుని రూ.89.40 కోట్లు వచ్చాయి. అటు ఓవర్ సీస్ లో ఈ మూడు రోజులో రూ.20.60 కోట్లు వసూలు చేసింది భీమ్లానాయక్. మొత్తం రూ.110 కోట్లు ఇప్పటి వరకు గ్రాస్ కలెక్షన్నలను భీమ్లా నాయక్ రాబట్టాడు.
ఇక ఈ వారం బుకింగ్స్ ను చూస్తే ఖచ్చితంగా మూవీ 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఊపు ఈ వారం అంతా కంటిన్యూ అయితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులను పవన్ బద్దలు కొట్టేస్తాడు. ఓవరాల్ గా 500 కోట్ల కలెక్షన్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్