https://oktelugu.com/

Bheemla Nayak: దీపావళి కానుకగా భీమ్లా నాయక్ టీజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్ …

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ […]

Written By: , Updated On : October 28, 2021 / 12:40 PM IST
Follow us on

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ కి సంబంధించి మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

bheemla nayak movie makers planning to release teaser on diwali

అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడి గా నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న సినిమా ను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న టీజర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అలానే పవన్ సినిమాల విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’… హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో కూడా మరో సినిమా చేయబోతున్నాడు.

రానా నటించిన విరాట పర్వం సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలానే తన బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ చేయనున్నాడు.