https://oktelugu.com/

Huzurabad bypoll : హుజూరాబాద్ లో.. బెట్టింగ్ బంగార్రాజులు! రేంజ్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

Huzurabad bypoll : బెట్టింగ్ అనగానే గతంలో అందరికీ క్రికెట్ మ్యాచ్ మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ట్రెండ్ మారింది. పందెం కాయాలనే ఉబలాటం ఉండాలేగానీ.. కాదేది బెట్టింగ్ కు అనర్హమని నిరూపిస్తున్నారు బెట్టింగ్ బంగార్రాజులు. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై పందేలు కాస్తున్నారు. అయితే.. ఏదో చిన్నా చితకా స్థాయిన్లో బెట్టింగ్ నడిపిస్తున్నారనుకుంటే పొరబడ్డట్టే. అందరూ నోరెళ్ల బెట్టే రేంజ్ లో పందేలు కాస్తున్నారు. హుజూరాబాద్ లో పలానా పార్టీ గెలుస్తుందని.. పలానా […]

Written By:
  • Rocky
  • , Updated On : October 28, 2021 12:26 pm
    Follow us on

    Huzurabad bypoll : బెట్టింగ్ అనగానే గతంలో అందరికీ క్రికెట్ మ్యాచ్ మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ట్రెండ్ మారింది. పందెం కాయాలనే ఉబలాటం ఉండాలేగానీ.. కాదేది బెట్టింగ్ కు అనర్హమని నిరూపిస్తున్నారు బెట్టింగ్ బంగార్రాజులు. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై పందేలు కాస్తున్నారు. అయితే.. ఏదో చిన్నా చితకా స్థాయిన్లో బెట్టింగ్ నడిపిస్తున్నారనుకుంటే పొరబడ్డట్టే. అందరూ నోరెళ్ల బెట్టే రేంజ్ లో పందేలు కాస్తున్నారు. హుజూరాబాద్ లో పలానా పార్టీ గెలుస్తుందని.. పలానా అభ్యర్థికి మెజారిటీ అంత వస్తుందని.. ఆ పార్టీ అభర్థికి ఓట్లు ఇన్ని వేల లోపే వస్తాయని.. ఇలా వివిధ స్థాయిల్లో బెట్టింగులు నడిపిస్తున్నారు.

    Huzurabad By-Elections

    అయితే.. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ లెక్కలు marintagaa మారిపోతున్నాయి. నిన్నామొన్నటి వరకు 100 నుంచి 200 కోట్ల మధ్యన సాగిన పందేలు.. తాజాగా వెయ్యి కోట్ల వరకు చేరినట్టు అంచనా. మొన్నటివరకు గెలుపు ఏకపక్షమే అన్నట్టుగా చాలామంది భావించగా.. ప్రస్తుతం మారిన పరిస్థితుల ప్రకారం హోరా హోరీ పోరు ఖాయమనే అభిప్రాయం బలపడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

    ఈ కారణంగానే బెట్టింగ్ వెయ్యి కోట్లవరకు చేరిందని అంటున్నారు. బెట్టింగ్ కాసేవారికి ఒకటికి నాలుగింతలు రిటర్న్స్ వస్తాయని చెబుతుండడంతో.. భారీగా పందేలు కాస్తున్నరనే చర్చ సాగుతోంది. అయితే.. అటు ఏపీలోని బద్వేల్ లోనూ బై ఎలక్షన్ జరుగుతున్నది. కానీ.. తెలంగాణ వైపే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపిస్తున్నారని టాక్.

    ఏపీలో పోటీ కేవలం వైసీపీ, బీజేపీ మధ్యనే ఉండటం.. గెలుపు అవకాశాలు వైసీపీకే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో.. అటువైపు చూడట్లేదని అంటున్నారు. హుజూరాబాద్ లో మాత్రం టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా పరిస్థితి ఉండటంతో బెట్టింగ్ వందల కోట్లకు చేరిందని అంటున్నారు. మరి, పోలింగ్ రోజు నాటికి పరిస్థితి ఇంద్కెలా ఉంటుందో చూడాలి.