Aadavallu Meeku Joharlu Box Office Collections: కూల్ హీరో శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కోసం ఓ రేంజ్ లో హడావిడి చేశారు. అయితే, సినిమా ప్రమోషన్స్ లో చూపించిన హడావుడి.. సినిమాలో మాత్రం కనిపించలేదు. ఫస్ట్ వీకెండ్ నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ చాలా వీక్ గానే ఉన్నాయి.
ఈ చిత్రం లేటెస్ట్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా ఒకసారి గమనిస్తే :
Also Read: ఇలా కూడా ఛాన్స్ ఇస్తారా ? బాలయ్య మాత్రమే ఇస్తాడు
నైజాం 1.12 కోట్లు
సీడెడ్ 0.32 కోట్లు
ఉత్తరాంధ్ర 0.38 కోట్లు
ఈస్ట్ 0.40 కోట్లు
వెస్ట్ 0.29 కోట్లు
గుంటూరు 0.28 కోట్లు
కృష్ణా 0.32 కోట్లు
నెల్లూరు 0.21 కోట్లు
ఏపీ మరియు తెలంగాణలో నిన్న వచ్చిన కలెక్షన్స్ మొత్తం కలుపుకుని చూస్తే : 3.31 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 కోట్లు
ఓవర్సీస్ 0.67 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 4.21 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
ఇక ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాకి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రూ.16.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అసలు ఇలాంటి సినిమా పై భారీగా ఖర్చు పెట్టడమే తప్పు. దానికి తోడు భారీ రేట్లకు అమ్మడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పటికైనా బయర్లు సినిమాలను కొనే విషయంలో ఆలోచించుకుంటే మంచిది. మొత్తమ్మీద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమే. చివరకు ‘ఆడవాళ్లు..’ దెబ్బకు నష్టాల్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి కూరుకుపోయాడు. దగ్గర దగ్గర 8 కోట్లు లాస్ అయినట్టు తెలుస్తోంది.
Also Read: బిగ్‌బాస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయ్యేది అమెనేనా..?