Bhavadeeyudu Bhagat Singh: పవన్ కళ్యాణ్ అభిమానులు మూడేళ్ళ నుండి ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘భవదీయుడు భగత్ సింగ్’..గబ్బర్ సింగ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఇది..వకీల్ సాబ్ సినిమా తర్వాత వెంటనే ప్రారంభం అవ్వాల్సిన ఈ సినిమా,కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది..అసలు ఉంటుందా లేదా అని అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతుంది..రేపు హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి..వచ్చే ఏడాది జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుంది..అయితే ఈ చిత్రం ఒరిజినల్ స్క్రిప్ట్ కాదని..తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన విజయ్ ‘తేరి’ చిత్రానికి రీమేక్ అంటూ మొన్న ఒక వార్త వచ్చింది..అభిమానులు దీనికి బాగా హర్ట్ అయ్యారు..మాకు తేరి రీమేక్ వద్దూ అంటూ నేషనల్ మీడియా లో ట్రెండ్ అయ్యేలా హోరెత్తించారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రోధాన్ని చూసి హరీష్ శంకర్ భయపడిపోయి ఒక రోజు మొత్తం ఆన్లైన్ లోకి అడుగుపెట్టలేదు..అసలు విషయానికి వస్తే ఈ చిత్రం తేరి కి రీమేక్ కాదు..కేవలం ఆ లైన్ మీద డెవలప్ చేసిన స్క్రిప్ట్..మన టాలీవుడ్ లో ఒకే లైన్ మీద వందల సినిమాలు వచ్చాయి..అవి సూపర్ హిట్ అయ్యాయి కూడా..కేవలం స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ లోనే దర్శకుడి ప్రతిభ దాగి ఉంటుంది..గబ్బర్ సింగ్ కూడా కథ పరంగా అదేమీ గొప్ప సినిమా ఏం కాదు.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూపించిన విధానం వేరే లెవెల్ లో అనిపించింది..అందుకే అంతటి సంచలన విజయం సాధించింది..కాబట్టి ఫ్యాన్స్ ఎలాంటి భయాలు పెట్టుకోనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో గబ్బర్ సింగ్ లాగ ఈ చిత్రం మిగిలిపోతుంది అంటూ ఇండస్ట్రీ కి చెందిన కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్తున్న మాట..ఇక ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.