https://oktelugu.com/

Raj Tarun: యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా హీరో రాజ్ తరుణ్ సంపాదించిన డబ్బులు ఎంతో తెలుసా..? ఈ రేంజ్ లో ఎవరు చేసుండరు!

రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభం లో కనీసం తినడానికి త్రింది, ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదు. రోడ్డు పక్కన్న ఉండే ఫ్లాట్ ఫారం పైన పడుకునే వాడు. అలాంటి కష్టాలు అనుభవించి వచ్చినోడు ఆయన. సినిమా ఇండస్ట్రీ వారికి తన టాలెంట్ తెలిసేందుకు ఎన్నో వందల షార్ట్ ఫిలిమ్స్ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 03:42 PM IST

    Raj Tarun

    Follow us on

    Raj Tarun: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా అవకాశాలను సంపాదించి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకడు రాజ్ తరుణ్. ఇతను ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు పడిన కష్టాల గురించి వింటే ఎవరికైనా కన్నీళ్లు రాక తప్పదు. కెరీర్ ప్రారంభం లో కనీసం తినడానికి త్రింది, ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదు. రోడ్డు పక్కన్న ఉండే ఫ్లాట్ ఫారం పైన పడుకునే వాడు. అలాంటి కష్టాలు అనుభవించి వచ్చినోడు ఆయన. సినిమా ఇండస్ట్రీ వారికి తన టాలెంట్ తెలిసేందుకు ఎన్నో వందల షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. అక్కినేని నాగార్జున కూడా రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన నటనను గమనించే తన అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్ లో పెట్టుకున్నాడు.

    ఆ సంస్థ నుండి తెరకెక్కిన అనేక సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాడు. అలా ఒకానొక సందర్భం లో నాగార్జున కొత్తవారితో ‘ఉయ్యాలా జంపాల’ సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడు. హీరో పాత్ర కోసం తన ప్రొడక్షన్ టీం లో పని చేస్తున్న రాజ్ తరుణ్ కి అవకాశం కల్పించాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. రాజ్ తరుణ్ కి వరుసగా హీరో అవకాశాలు వచ్చేలా చేసాయి. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘సినిమా చూపిస్తా మావా’, ‘కుమారి 21 ఎఫ్’ , ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆడో రకం..ఈడో రకం’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసాడు. కానీ గత కొంతకాలం గా ఈయనకి సరైన సక్సెస్ లేదు. చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. కొత్తగా ఈమధ్య ఈయన పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఇమేజి మసకబారింది. ఒకప్పుడు కనీస స్థాయి ఓపెనింగ్స్ అయినా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. నేడు ఆయన ‘భలే ఉన్నాడే’ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు. ఆసక్తికరమైన ట్రైలర్ తో విడుదలకు ముందే ఆకట్టుకున్న ఈ చిత్రానికి నేడు పాజిటివ్ టాక్ వచ్చింది.

    ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా తాను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో తన యూట్యూబ్ ఛానల్ ని రాజ్ తరుణ్ మానిటైజ్ చేయించలేదట. తన వీడియోస్ కి మంచి వ్యూస్ వచ్చినా డబ్బులు సంపాదించుకోవాలని అనుకోలేదట. కేవలం ఇండస్ట్రీ వారు తన టాలెంట్ ని గుర్తిస్తే చాలు అని అనుకున్నాడట. అలా అప్పట్లో ఆయన యూట్యూబ్ ద్వారా ఒక్క పైసా సంపాదించకుండా వీడియోలు చేసేవాడు అట. ఈ విషయాన్నీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. అలా కస్టపడి పైకి వచ్చిన రాజ్ తరుణ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.