lsoBhairavam Trailer : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas) హీరోగా వస్తున్న భైరవం (Bhairavam)సినిమా ఈనెల 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేశారు… ఈ ట్రైలర్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ కి, నారా రోహిత్, మంచు మనోజ్ లు అన్నయ్యలుగా నటించినట్టుగా తెలుస్తోంది. ట్రైలర్లో ఈ సినిమా ఒక ఊర్లోని వారాహి అమ్మ వారి గుడికి సంబంధించిన స్టోరీగా తెలుస్తోంది. ఆ గుడి లోని ఆభరణాలను, అలాగే గుడి ఉన్న ప్రదేశాన్ని కబ్జా చేయాలని ఒక మంత్రి దానికి వ్యతిరేకంగా ఉంటూ ఆ భూమిని కబ్జా చేయపని చేస్తుంటాడు. ఇక ఈ ముగ్గురు హీరోలు కలిసి పోరాడి ఆ మంత్రిని ఏం చేశారు. గురి రక్షించు కున్నారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తోంది.
Also Read : ‘వార్ 2’ టీజర్ నుండి ఎన్టీఆర్ డైలాగ్ లీక్..ఈ రేంజ్ లో ఉందేంటి బాబోయ్!
అయితే ఈ ట్రైలర్ లో నారా రోహిత్ (Nara Rohith, మంచి మనోజ్ (Manchu Manoj) ఇద్దరూ హీరోకి అన్నయ్యలుగా నటించినప్పటికి చివరి నిమిషంలో మాత్రం వాళ్లు కూడా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా ట్రైలర్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది.ఇక మొత్తానికైతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు చేసిన సినిమాలను పక్కనపెట్టి ఇప్పుడు ఒక డిఫరెంట్ జానర్ ని ఎంచుకొని సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక అతనిలో కూడా మార్పు అనేది స్టార్ట్ అయింది కాబట్టి మంచి సినిమాలను చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని సినిమా ప్రేక్షకులంతా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసినా కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మాత్రం సరైన సక్సెస్ అయితే రావడం లేదు.
బాలీవుడ్ కి వెళ్లి ఛత్రపతి (Chatrapathi) సినిమా రీమేక్ చేసినప్పటికి అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఈ బైరవం సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే ఆయన కెరియర్ అనేది మరింత ముందుకు సాగుతుంది. లేకపోతే మాత్రం ఈ సినిమాతో తనను తాను ఐడెంటిటి ని కోల్పోవడమే కాకుండా తన మార్కెట్ ను కూడా చాలా వరకు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది…