Bhagyashri Borse: సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. కొంతమంది మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ప్రేమగా కూడా మారుతుంది. ఇలా చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన భాగ్యశ్రీ బోర్సీ ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస ప్లాప్ లను మూట గట్టుకుంది. రీసెంట్ గా అఖిల్ హీరోగా చేసిన ‘లెనిన్’ సినిమాతో సక్సెస్ సాధించిన ఆమె రీసెంట్ గా జరిగిన ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో ఎమోషనల్ అయింది. ఇక ఏది ఏమైనా కూడా తనకు మంచి సక్సెస్ దక్కిందని ఆమె అభిప్రాయపడుతుంది. తన ఊపిరి ఉన్నంత వరకు తెలుగులోనే సినిమాలు చేస్తానని చెప్పడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇప్పటివరకు మీరు నటించిన హీరోల్లో మీకు మంచి ఫ్రెండ్ అయిన హీరో ఎవరు? ఎవరితో డేట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలైతే అడిగారు.
దానికి ఆమె సమాధానంగా అఖిల్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ఇక డేటింగ్, పెళ్లి విషయానికి వస్తే నేను ఇప్పటి వరకు సినిమాలు చేసిన హీరోల్లో ఒక హీరోకి మాత్రమే ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అతను ఓకే అంటే అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటూ ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. గత కొద్ది రోజులుగా భాగ్యశ్రీ రామ్ ఇద్దరు డేట్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఆమె చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి హీరో రామ్ మోస్ట్ ఎలిజిబుల్బ్యాచిలర్ గా నిలిచిపోతున్నాడు. తన తోటి హీరోలందరు పెళ్లి చేసుకున్నప్పటికి రాము ఇంకా పెళ్లి చేసుకోలేదు. వీళ్లిద్దరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది…
