Bhagyashri Borse Viral Video: గత కొంతకాలం గా సోషల్ మీడియా లో హీరో రామ్ , భాగ్యశ్రీ భొర్సే మధ్య రిలేషన్ ఉందని, వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని , ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని , హైదరాబాద్ లో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని, ఇలా ఎన్నో రకాలా వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై అటు రామ్ కానీ , ఇటు భాగ్యశ్రీ కానీ బలంగా రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నిన్న మాత్రం భాగ్యశ్రీ పరోక్షంగా రామ్ తో రిలేషన్ లో ఉన్నట్టు ఒక చిన్న క్లారిటీ ఇచ్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వీళ్లిద్దరు హీరో హీరోయిన్లుగా నటించిన ‘లెనిన్’ చిత్రం వచ్చే నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అఖిల్ , భాగ్యశ్రీ కలిసి ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ముందుగా యాంకర్ సినిమాతో కలిసి ఒక కిచెన్ ఇంటర్వ్యూ చేశారు.
ఆద్యంతం సరదాగా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూ లో ‘నా మొదటి ఇల్లు ముమ్మాటికీ ఔరంగాబాద్, రెండో ఇల్లు హైదరాబాద్, ఆల్రెడీ ఉంది’ అని చెప్పుకొచ్చింది. దీంతో సుమ ‘చాలా మంచిది.. చాలా మంది హీరోయిన్లు హైదరాబాద్ లో ఈమధ్య స్థిరపడుతున్నారు , నువ్వు కూడా అలా ఇక్కడే స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని అర్థం ఏంటో నాకు కూడా తెలీదు ‘ అంటూ నవ్వుతూ ఆశీర్వదించింది. అంటే భాగ్యశ్రీ , రామ్ పోతినేని ఇంట్లో ఉంటుంది కాబట్టి, నా రెండవ ఇల్లు హైదరాబాద్ అని చెప్పింది , దీనిని సుమ కూడా పరోక్షంగా ఖరారు చేసింది , ఎందుకంటే వాళ్లకు ఇలాంటి విషయాలు తెలుసు కాబట్టి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్క రామ్ కూడా రిలేషన్ లో ఉన్నట్టు పరోక్షంగా ఒక ఇంటర్వ్యూ లో ఖరారు చేశారు , కానీ ఎవరితో రిలేషన్ లో ఉన్నారు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
ఇక లెనిన్ విషయానికి వస్తే , ఈ సినిమా అఖిల్ కి ఎంత ముఖ్యమో , భాగ్యశ్రీ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా అఖిల్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు , అదే విధంగా భాగ్యశ్రీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు, అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి , అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. రెండు సార్లు వాయిదా పడినప్పటికీ కూడా ఆడియన్స్ లో అంచనాలు తగ్గలేదు. కచ్చితంగా పెద్ద రేంజ్ కి వెళ్తుందని అనుకుంటున్నారు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

