Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Upcoming Movie: డిజాస్టర్ డైరెక్టర్ తో చేతులు కలిపిన రవితేజ.. మరోసారి ట్రాక్...

Ravi Teja Upcoming Movie: డిజాస్టర్ డైరెక్టర్ తో చేతులు కలిపిన రవితేజ.. మరోసారి ట్రాక్ తప్పుతున్నాడు..

Ravi Teja Upcoming Movie: ఈ ఏడాది స్టార్ హీరోల కం బ్యాక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయింది. 14 ఏళ్ళ నుండి సరైన సూపర్ హిట్ లేక , తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకుంటున్న తమిళ హీరో సూర్య రీసెంట్ గానే ‘కరుప్పు’ చిత్రం తో ఏ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడో మనమంతా చూసాము. ఒక్క దెబ్బకు నేరుగా 330 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి తన సత్తా ఎలాంటిదో నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం తో 340 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఆయన కూడా సోలో హీరో గా భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చేసింది. ఆయన కూడా ‘ఇరుముడి’ చిత్రం తో భారీ లెవెల్ లో కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని అంతా అనుకున్నారు.

ఇప్పటి వరకు ఆ సినిమా పై ఆడియన్స్ లో మంచి పాజిటివ్ వైబ్స్ మాత్రమే క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి , మొన్న విడుదలైన గ్లింప్స్ వీడియో వరకు ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ కం బ్యాక్ కళ్ళ ముందు కనిపిస్తోంది , ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేదని అంతా అనుకున్నారు. ఈ సినిమా వరకు అవన్నీ జరగొచ్చేమో కానీ , ఈ చిత్రం తర్వాత ఆయన ఒప్పుకున్నా సినిమా ని చూస్తే మళ్లీ ఆయన ట్రాక్ తప్పుతున్నాడేమో అని అనిపిస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , రవితేజ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ మారుతీ తో చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే మారుతీ ‘రాజాసాబ్’ చిత్రం తో ఎంత పెద్ద ఫ్లాప్ ని అందుకున్నాడో మనమంతా చూసాము.

హిట్, ఫ్లాప్ అనేది ఎవరికైనా సహజం కదా, మారుతీ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు , కచ్చితంగా ఎదో ఒకరోజు మంచి కం బ్యాక్ ఇస్తాడని అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ‘రాజా సాబ్’ చూసిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. ఇంతటి వీక్ రైటింగ్ ఈమధ్య కాలంలో ఏ స్టార్ డైరెక్టర్ కూడా రాయలేదు. కచ్చితంగా మారుతీ లో ఒకప్పుడు ఉన్న రైటింగ్ స్కిల్స్ ఇప్పుడు లేవు, బాగా తగ్గిపోయాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ రవితేజ ‘ఇరుముడి’ తో కం బ్యాక్ ఇచ్చినా , మారుతీ తో తదుపరి చిత్రం చేస్తే భారీ ఫ్లాప్ ని ఎదురుకోక తప్పదని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అతనితో చేయొద్దని సలహా ఇస్తూ రవితేజ ని ట్యాగ్ చేస్తున్నారు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version