Dulquer Salmaan: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే ఆడియన్స్ లో అశేష ఆదరణ దక్కించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా అరుదుగా ఈ అదృష్టం దక్కుతూ ఉంటుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు భాగ్యశ్రీ భొర్సే(|Bhgyasri Bhorse). ఈమె రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ కూడా భాగ్యశ్రీ కి క్రేజ్, పాపులారిటీ వచ్చింది అంటే, ఆమె యూత్ ఆడియన్స్ ని ఎంతలా ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. కొద్దిరోజుల క్రితమే ఈమె మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో కలిసి ‘కాంతా'(Kantha Movie) అనే చిత్రం లో నటించింది. అదే విధంగా మరో ఆరు రోజుల్లో ఆమె రామ్ పోతినేని తో కలిసి నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా కాంతా చిత్రం లో దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన అనుభవం గురించి ఆమె మాట్లాడిన మాటలు వింటుంటే సూపర్ అని అనిపించింది. ఆమె మాట్లాడుతూ ‘ ఈ చిత్రం లో నేను ఒక సన్నివేశం లో దుల్కర్ సల్మాన్ గారి చెంప పగలగొట్టాలి. అంత పెద్ద స్టార్ తో ఇలాంటి సన్నివేశాలు చేయమంటే ఎంత టెన్షన్ గా ఉంటుందో మీరు ఊహించుకోగలరు. నేను ఈ షాట్ ని చేయడానికి చాలా భయపడ్డాను. నా వల్ల అవ్వలేదు. కానీ దుల్కర్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నువ్వు నన్ను ఎంత గట్టిగా కొడితే అంత ఎమోషన్ వస్తుందని చెప్పారు. ఇక తప్పక, అతి కష్టం మీద ఆయన చెంప మీద బలంగా కొట్టాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ.