Box Office War: భగవంత్ కేసరి-లియో-టైగర్ నాగేశ్వరరావు… దసరా విన్నర్ ఎవరంటే?

అక్టోబర్ 19న భగవంత్ కేసరి, లియో విడుదలయ్యాయి. ఒకరోజు వ్యవధిలో అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు దసరా బరిలో దిగింది. భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Written By: NARESH, Updated On : October 21, 2023 10:01 am

Box Office War

Follow us on

Box Office War: కంటెంట్ కి మించి ఒక సినిమా సక్సెస్ ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో రిలీజ్ డేట్ ఒకటి. ఏడాదిలో కొన్ని గోల్డెన్ పీరియడ్స్ ఉంటాయి. ఆ టైం లో సినిమా రిలీజ్ అయితే టాక్ అటూ ఇటూ ఉన్నా మినిమమ్ వసూళ్లు రాబట్ట వచ్చు. ఇక హిట్ టాక్ వస్తే వసూళ్ల వర్షమే. వాటిలో సంక్రాంతి, దసరా ముఖ్యమైనవి. విద్యాసంస్థలకు పది రోజులు సెలవులు దొరికే దసరా పండగ బెస్ట్ రిలీజ్ సీజన్ అనుకోవచ్చు. ఒక 2023 దసరా సీజన్ పై బాలకృష్ణ, విజయ్, రవితేజ కన్నేశారు.

అక్టోబర్ 19న భగవంత్ కేసరి, లియో విడుదలయ్యాయి. ఒకరోజు వ్యవధిలో అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు దసరా బరిలో దిగింది. భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో బాలయ్య మార్క్ మిస్ అయినా.. యాక్షన్, ఎమోషనల్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయని పలువురు క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. లియో మాత్రం పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు. ఏదో రొటీన్ కమర్షియల్ మూవీలా ఉందన్నారు.

అయితే లియో టెక్నికల్ గా మెప్పించిందని అభిప్రాయ పడ్డారు. దీంతో టైగర్ నాగేశ్వరరావు ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా రవితేజ దసరా విన్నర్ అవుతాడని చిత్ర వర్గాలు భావించాయి. అనూహ్యంగా టైగర్ నాగేశ్వరరావు కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, అయితే సెకండ్ హాఫ్ డైరెక్టర్ సరిగా డీల్ చేయలేదు. నిడివి పెరిగి సాగతీతకు గురైందన్న టాక్ వినిపించింది.

కాగా టాక్ కి భిన్నంగా వసూళ్లు ఉండటం విశేషం. లియో, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల కంటే మెరుగైన టాక్ తెచ్చుకున్న భగవంత్ కేసరి కలెక్షన్స్ ఆ స్థాయిలో లేవు. రెండేళ్ల క్రితం విడుదలైన బాలయ్య అఖండ కంటే తక్కువ వసూళ్లు ఫస్ట్ డే నమోదు అయ్యాయి. ఫస్ట్ డే ఏపీ/తెలంగాణాలలో భగవంత్ కేసరి కేవలం రూ. 13-14 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అఖండ రూ. 15, వీరసింహారెడ్డి రూ. 25 కోట్లతో సత్తా చాటాయి.

లియో నెగిటివ్ టాక్ తెచ్చుకుని కూడా సత్తా చాటింది. ఈ మూవీ ఫస్ట్ డే ఏపీ/తెలంగాణాలలో రూ. 15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్ర హక్కులు రూ. 16 కోట్లకు కొన్నట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ లియో అన్ని భాషల్లో కలిపి రూ. 148.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. టైగర్ నాగేశ్వరరావు విషయానికి వస్తే… నెగిటివ్ రివ్యూలు వచ్చినా టైగర్ నాగేశ్వరావుకు ఫుట్ ఫాల్స్ బాగున్నాయి. ఫస్ట్ డే ఏపీ/తెలంగాణాలలో రూ. 8 కోట్ల షేర్ వసూలు చేసింది. కాబట్టి దసరా విన్నర్ ఎవరో తెలియాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే…