Bhagavanth Kesari Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే…ఈయన తన కెరీర్ లో చాలా సినిమాలు తీసి యువరత్న నందమూరి బాలకృష్ణ గా ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన 100 కి పైన సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు… ఇక దానికి తగ్గట్టుగానే ఆయన వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.బాలయ్య బాబు ఏజ్ పెరిగేకొద్దీ యువకుడిలా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం సవాళ్లను విసురుతున్నాడు.
అఖండ,వీరసింహారెడ్డి సినిమాలతో సాధించిన సక్సెస్ లను కొనసాగిస్తూ బాలయ్య హ్యాట్రిక్ హిట్లు సాధించడానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసర కానుకగా అక్టోబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమం లో ఈ సినిమా ట్రైలర్ ఈనెల 8 వ తేదీన వస్తుంది అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి…. ఇక దాంట్లో భాగంగానే వచ్చిన టీజర్లు గాని, సాంగ్స్ గాని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి…ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన స్టోరీ ఏంటి అనేది ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజనులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడానికి గిరిజన బిడ్డగా బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ఇందులో శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తుంది. గిరిజనులకు జరిగిన అన్యాయమే కాకుండా తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని, తన కూతురికి జరిగిన అవమానాన్ని అన్నింటి లెక్కలు తేల్చడానికి రౌడీలతో బాలయ్య చేసే పోరాటమే ఈ భగవంత్ కేసరి సినిమా స్టోరీ అని అర్థం అవుతుంది…
ఈ స్టోరీ ని ఇంకొంచం డీటెయిల్ గా చెప్పాలంటే గిరిజనుల హక్కులను కాలరాస్తూ కొంత మంది రాజకీయ నాయకులు వాళ్ల భూములను ఆక్రమించుకోవాలని చూసినప్పుడు అందులో నుంచి పుట్టిన వ్యక్తే మన భగవంత్ కేసరి… అయితే రాజకీయ నాయకులతో పోరాడినప్పుడు ఆయన ఫ్యామిలీ ఆయనకి దూరమవుతుంది తన భార్యను కూడా కొంతమంది దుండగులు చంపేస్తారు వీటన్నింటికి రివెంజ్ తీర్చుకోవడం తన కూతురితో కలిసి హ్యాపీగా బతకడానికి బాలయ్య చేసే ప్రయత్నమే ఈ భగవంత్ కేసరి సినిమా స్టోరీ అనేది తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అనే టాక్ అయితే ఇండస్ట్రీలో భారీగా వినిపిస్తుంది. ఇక అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా కామెడీగా సాగితే ఈ సినిమా మాత్రం కంటెంట్ ని బేస్ చేసుకుని సాగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో కొత్త బాలయ్యని చూడబోతున్నారు అంటూ ఇప్పటికే అనిల్ రావిపూడి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. బాలయ్య ఈ సినిమా కోసం తెలంగాణ యాస లో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్ లను చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది…