Virat Kohli : మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క బంతి పడకుండానే ఇంగ్లాండ్, భారత్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగలేదు. దీంతో అభిమానులు మొత్తం ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో తిరువనంతపురంలో జరిగే మ్యాచ్ కయినా ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా కూడా తిరువనంతపురం చేరుకుంది. ఆటగాళ్లు హోటల్ గదుల్లోకి వెళ్లిపోయారు. మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే ఈ ఆటగాళ్ల బృందంలో స్టార్ క్రికెటర్ కనిపించలేదు. దీంతో స్పోర్ట్స్ మీడియా సంస్థలు అతనిపై ఆరా తీశాయి. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టీమిండియా జట్టుతో కలిసి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తిరువనంతపురం రాలేదు. అస్సాం రాష్ట్రంలోని గుహవాటి నుంచి టీం ఇండియా జట్టు తిరునంతపురం బయలుదేరితే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రం అక్కడి నుంచి హఠాత్తుగా ముంబై వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీ ఉన్నటువంటి ముంబై వెళ్లిపోవడం వెనక మీడియా ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వ్యక్తిగత కారణాలతోనే అతడు అత్యవసరంగా ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ తిరిగి సోమవారం జట్టుతో చేరుతాడు అని ప్రకటించాయి. అయితే ఉన్నట్టుండి విరాట్ కోహ్లీ ముంబై వెళ్లడం వెనక బలమైన కారణం ఉందని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండవసారి తల్లి కాబోతోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ హఠాత్తుగా ముంబై వెళ్లారని సమాచారం. ఇక విరాట్, అనుష్క శర్మ ఇటీవల ముంబైలోని గైనకాలజీ ఆసుపత్రి వద్ద కల్పించడం పై వాదనకు బలం చేకూర్చుతోంది. ఇక 2017లో కోహ్లీ, అనుష్కల వివాహం జరిగింది. వీరికి 2021లో వామిక అనే పాప జన్మించింది..కాగా, గుహవాటి వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి వార్మప్ వర్షం వల్ల రద్దయింది. ప్రపంచకప్ టోర్నీకి ముందు చివరిదైనా రెండవ వార్మప్ మ్యాచ్ మంగళవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరుగుతుంది. నెదర్లాండ్ తో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.. ఇక వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8న టీమిండియా తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడనుంది.