Bhagavanth Kesari Collection: సెలవు దినాలు ముగిసినా భగవంత్ కేసరి వసూళ్లు నిలకడగా ఉండడం విశేషం. 7వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. ఆరు రోజులకు భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ రూ.51.8 కోట్ల షేర్ వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇది జీఎస్టీతో కలుపుకుని అని చెప్పారు. 7వ రోజు భగవంత్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. నిర్మాతల లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్లు, వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల షేర్ భగవంత్ కేసరి అందుకుంది. అనగా 7 రోజులకు భగవంత్ కేసరి రూ. 56.8 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ అందుకున్నట్లు.
ఇక భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ గమనిస్తే సాధించాల్సిన టార్గెట్ ఇంకా ఉంది. ఏపీ/తెలంగాణాలలో భగవంత్ కేసరి రూ.55 కోట్ల బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 67 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే రూ. 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాలయ్య దసరా బరిలో దిగారు. దాదాపు మరో రూ. 11 కోట్లకు పైగా వసూళ్ళు సాధిస్తే కానీ భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకోదు. ఇలాగే నిలకడగా రాణిస్తే ఈ టార్గెట్ అంత కష్టం ఏమీ కాదు.
భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఎమోషనల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. మొన్నటి వరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల భగవంత్ కేసరి చిత్రంలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెకు కనీసం ఓ సాంగ్ కూడా లేదు. కాజల్ ది కేవలం కరివేపాకు పాత్ర. బాలయ్య మాత్రం తన స్కూల్ నుండి బయటకు వచ్చి చేశాడు. అక్టోబర్ 19న విడుదలైన భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.