Car Offers: అసలే ధర తక్కువ.. అందులోనూ డిస్కౌంట్.. పండుగపూట ఈ కార్లపై భారీ తగ్గింపు..

మారుతి సుజుకీ నుంచి సెలెరియో ఎగ్జైట్మెంట్ ఆఫర్ ప్రకటించింది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 67 పీఎస్ శక్తి, ప89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By: Srinivas, Updated On : October 26, 2023 5:33 pm

Car Offers

Follow us on

Car Offers: వరుస పండుగల నేపథ్యంలో ఆటోమోబైల్ రంగంలోని కొన్ని కార్ల కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సాధారణ రోజుల కంటే దసరా, దీపావళి సందర్భంగా చాలా మంది వినియోగదారులు కార్ల ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ తగ్గింపుతో కార్లను విక్రయిస్తున్నారు. ఈ కార్లకు ఇప్పటికే ధర తక్కువ..అందులోనూ భారీగా డిస్కౌంట్ ప్రకటించడంతో కస్టమర్లు ఇంప్రెస్ అవుతున్నారు. ఇంతకీ కార్లు ఏవో తెలుసుకుందాం..

ఎస్ ప్రెస్సో -రూ.50,000 తగ్గింపు..
మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయినా ఎస్ ప్రెస్సో స్టైలిష్ లుక్ లో ఆకర్షిస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 68 పీఎస్ పవర్, 90 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేరస్తుంది. 5- స్పీడ్ మాన్యువల్ త పాటు ఏఎంటీని కలిగి ఉంది. ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. దీని ధర రూ.6.10 లక్షలు, సీఎన్ జీ రూ.6.55 తో విక్రయిస్తున్నారు. ఈ కారుపై ఢిల్లీలో రూ.54,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే నవంబర్ 1 లోపు మాత్రమే ఇది వర్తిస్తుంది.

సెలెరియో -రూ.59,000 తగ్గింపు
మారుతి సుజుకీ నుంచి సెలెరియో ఎగ్జైట్మెంట్ ఆఫర్ ప్రకటించింది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 67 పీఎస్ శక్తి, ప89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఫుస్ బటన్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. దీనిని రూ.5.90 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై క్యాష్ బెన్ఫిట్ రూ.35,000, ఎక్చేంజ్ ఆఫర్ రూ.20,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000 వరకు ఆఫర్ ప్రకటించారు.

వ్యాగన్ ఆర్ – రూ.20,000
మారుతి సుజుకీ నుంచి అత్యధిక అమ్ముడు పోతున్న కారు వ్యాగన్ ఆర్. ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్ తో పాటు 67 పీఎస్ పవర్, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది. ఈ కారును రూ.6.13 లక్షలతో విక్రయిస్తుండగా దీనిపై ఎక్చేంజ్ బోనస్ రూ.20,000 వరకు పొందవచ్చు.

రెనాల్ట్ క్విడ్ : రూ.50,000
రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ 1.0 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ కారు 67 బీహెప్ పీ పవర్, 91 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.6.58 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై వివిధ వేరియంట్లలో రూ.50 వేల వరకు డిస్కౌంట్ ను ప్రకటించారు.