https://oktelugu.com/

KGF : కేజిఎఫ్ ను మించి.. నానీ పారడైజ్.. అంచనాలు పెంచేశాడు…

KGF : యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళు చేసిన ప్రతి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నారు.

Written By: , Updated On : April 3, 2025 / 08:05 AM IST
KGF

KGF

Follow us on

KGF : యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళు చేసిన ప్రతి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే నాని లాంటి హీరో సైతం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇప్పటికే చాలామంది ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోలు వల్ల స్టార్ డమ్ ను విస్తరించుకుంటున్నారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ప్యారడైజ్’ (Paradaise) సినిమా భారీ అంచనాలనైతే పెంచేసింది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రీసెంట్ గా రిలీజ్ అవ్వడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా భారీ విజయాని సాధిస్తుంది అంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలయితే వస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి అంటూ నాని సైతం ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతుండడం విశేషం… నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఇంతకుముందు వచ్చిన దసర (Dasara) సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వీళ్ళిద్దరూ భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా కాంబినేషన్ లో మరో సినిమా రావడానికి కూడా ఆ సక్సెస్ అనేది తోడ్పడింది.

Also Read : నెల రోజుల షూటింగ్ మొత్తం బూడిదపాలు..’కేజీఎఫ్’ హీరో యాష్ చేసిన పనికి వెక్కి ఏడుస్తున్న నిర్మాత!

ఇంతకుముందు ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ (KGF) సినిమా కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించింది. కాబట్టి కేజీఎఫ్ బాటలోనే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక కెజిఎఫ్ లో మదర్ సెంటిమెంట్ హైలెట్ గా నిలువగా ప్యారడైజ్ లో సైతం మదర్ సెంటిమెంటును టాప్ లెవల్లో చూపించబోతున్నారట…

ఇప్పటివరకు నాని సాధించిన విజయాలన్నింటిలో దసర సినిమా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి భారీ సక్సెస్ గా నిలిచింది. మరి ఆ సినిమా బాటలోనే ఈ సినిమా కూడా నడుస్తుందని చాలామంది సినిమా మేధావులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమా గ్లింప్స్ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ ఎత్తున సక్సెస్ ను నమోదు చేయబోతుంది అంటూ కొన్ని కథనాలనైతే వెల్లడిస్తున్నారు.

ఇక 1960వ సంవత్సరంలో హైదరాబాద్ లో రెడ్ లైట్ ఏరియా అయితే ఉండేది. దాని పేరు ‘ప్యారడైజ్’ (Paradaise) అని పిలుస్తూ ఉండేవారు. ఇక దాని ఆధారంగా ఒక రచయిత రాసిన బుక్ లోని కంటెంట్ ను చూసి ఇన్స్పైర్ అయిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది…

Also Read : యష్ తప్పు చేశాడా? ఫ్యాన్స్ అనుకున్నదే అయ్యింది… టాక్సిక్ నిర్మాతలకు భారీ లాస్!