https://oktelugu.com/

ప్లాప్ సినిమాలకి బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ !

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమా మిశ్రమ స్పందనలతో తెలుగులో ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ప్లాప్ సినిమా అనేకంటే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద పరాజయం అయిన సినిమాగా నిలిచిపోయింది. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్స్ నటించినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. అయితే రీసెంట్ గా ఈ […]

Written By:
  • admin
  • , Updated On : September 24, 2020 / 02:34 PM IST
    Follow us on


    సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమా మిశ్రమ స్పందనలతో తెలుగులో ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ప్లాప్ సినిమా అనేకంటే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద పరాజయం అయిన సినిమాగా నిలిచిపోయింది. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్స్ నటించినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. అయితే రీసెంట్ గా ఈ సినిమా బుల్లితెర పై ప్రసారం అయింది. జెమినీ టీవీలో వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయగా ఈ చిత్రానికి 5.8 టీఆర్పీ వచ్చింది.

    Also Read: స్టార్ హీరో భారీ డిమాండ్.. బాధలో నిర్మాతలు !

    ఒక ప్లాప్ సినిమాకి ఈ రేంజ్ రేటింగ్ రావడం విశేషమే. ఇక ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు వెంకటేష్ మహా నుండి ఈ లాక్ డౌన్ లో నేరుగా ఓటిటిలో విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. కాగా సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని, బాహుబలి సినిమా నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఏప్రిల్ 17వ తేదిన విడుదల అయిన ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను బాగా అలరించింది.

    Also Read: ఓటీటీలో సినిమా ప్లాప్ అయితే డబ్బులు వెనక్కి?

    అందుకే ఈ చిత్రానికి కూడా రెండు వారాల కితం స్మాల్ స్క్రీన్ పై టెలి కాస్ట్ అయింది. ఈటీవీలో వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయిన ఈ చిత్రం కూడా మంచి టీఆర్పీ రేటింగ్ నే సాధించింది. ఈ సినిమా టీఆర్పీ విషయానికి వస్తే.. 5.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మొత్తానికి ఈ రెండు చిత్రాలకు మంచి రేటింగ్ రావడంతో మిగిలిన సినిమాలకు కూడా కాస్త డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.