AP Politics Communist Party: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పొత్తులపై కూడా ఎత్తులు వేస్తున్నారు. అధికారం కోసం ఏ పార్టీతో అయినా కలిసేందుకు కొన్ని పార్టీలు చూస్తుంటే తమకు నచ్చిన పార్టీతోనే నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో పెనుమార్పులు జరిగే అవకాశాలున్నాయి. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనే క్రమంలో పొత్తుల వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ లో మరిన్ని మార్పులు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీ జనసేనతో పొత్తులో ఉండటంతో వారి కలయికలో రాబోయే ఎన్నికలను ఎదర్కోనున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం జనసేనతోనే పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నందున దానికి బీజేపీ అనుమతి తప్పనిసరి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి పొత్తు అవకాశాలు ఉంటాయా? లేక ఒంటరిగానే పోటీలో ఉంటుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. మరోవైపు టీడీపీ గట్టెక్కాలంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం ఉండాలని టీడీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడం లేదు.
Also Read: Kapu Community: ఎప్పుడు‘కాపు’కాయడమేనా.. రాజ్యాధికారం చేరువలో కాపులు
ఇక మిగిలింది కమ్యూనిస్టు నేతలే కావడంతో పొత్తు విషయంలో వారు కూడా టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. సీపీఐ కార్యదర్శి నారాయణ ఈ మేరకు స్పందించారు. టీడీపీతో కలిసే పరిస్థితి లేదని చెబుతున్నారు. చంద్రబాబుపై విమర్శలే చేస్తున్నారు. 1983లో టీడీపీ కమ్యూనిస్టులను పక్కనపెట్టేసి అధికారం చెలాయించిందని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ సమర్థుడైన నాయకుడే కానీ మాకు తగిన విలువ ఇవ్వలేదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు తాము సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో కమ్యూనిస్టులు మాత్రం దేనితో కూడా కలిసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అలాగని వాటి ప్రభావం కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలో సీపీఐ, సీపీఐఎం పార్టీలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. మొత్తానికి కమ్యూనిస్టుల కాలం అయిపోయింది. దేశంలో అవి అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి. దీంతో వాటి ప్రభావం లేకుండాపోతోంది. వాటితో పొత్తుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదనే విషయం తెలిసిందే.
Also Read: Paddy Row: టీఆర్ఎస్ వరియుద్ధం ఫ్లాప్ అయ్యేనా అన్నా
Recommended Video: