Best Advertisement 2025: ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అది ప్రజలకు రీచ్ కావాలి. ప్రజలకు రీచ్ కావాలంటే అది ఆకట్టుకునే విధంగా ఉండాలి. దానిలో ఉన్న గొప్పతనం గురించి చెప్పగలగాలి. అప్పుడే ప్రజల దానిని నమ్ముతారు. దానిని కొనుగోలు చేయడానికి ఇష్టాన్ని చూపిస్తుంటారు.
మార్కెట్లో స్టీల్ అమ్మే కంపెనీలు ఎన్ని ఉన్నా సరే వైజాగ్ కర్మగారంలో తయారయ్యే ఉక్కు ఉత్పత్తికి ఉన్న డిమాండ్ వేరు. ఎందుకంటే దానిలో ఉన్న నాణ్యత ఆ విధంగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా బయట మార్కెట్లో ఎన్ని మిల్క్ కంపెనీలో ఉన్నప్పటికీ.. అమౌంట్, విజయ కంపెనీలకు ఉన్న విలువ ప్రత్యేకమైనది. ఇక గృహ నిర్మాణానికి వాడే సిమెంట్ లలో అల్ట్రాటెక్ ప్రత్యేకమైనది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఒక ఉత్పత్తి కస్టమర్ కు రీచ్ కావాలంటే దానికి అనేక భిన్నమైన పద్ధతులు ఉంటాయి. ఆ కంపెనీలు చేసే ప్రకటనలు కస్టమర్లకు రీచ్ అయితే.. ఆ ఉత్పత్తిలో క్వాలిటీ ఉంటే కచ్చితంగా ఆదరణ లభిస్తుంది. అదే స్థాయిలో ఆ కంపెనీల ఉత్పత్తుల విలువ పెరుగుతుంది. అయితే కొన్ని కంపెనీలు తాము తయారు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడంలో విభిన్నమైన తీరును ప్రదర్శిస్తుంటాయి. అందులో కొంతమంది వ్యక్తులు కూడా డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు. డిఫరెంట్ గా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటారు. అయితే ఈ జాబితాలో ఈ వ్యక్తి పీహెచ్డీ చేశాడు అనుకుంటా.
Also Read: Dhoni’s ‘Animal’ ad : అక్షరాలా 50 మిలియన్ వ్యూస్..ధోని ‘యానిమల్’ యాడ్ దుమ్మురేపుతోంది!
ఏం వాడకం రా బాబూ
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో.. హాలీవుడ్ సినిమా లో ఉన్న దృశ్యం కనిపిస్తోంది. అందులో హీరో తన ఆఫీసులో పనిచేసే వారి ప్రాణాలు కాపాడేందుకు బిల్డింగ్ మీద నుంచి పైకి దూకి వేస్తాడు. అతడు ఎందుకు దునుకుతున్నాడో తెలియక తోటి ఉద్యోగులు కూడా అదే పని చేస్తారు. దీంతో అతడు తనతో పనిచేస్తున్న ఉద్యోగులను చూసి కన్నీరు పెట్టుకుంటాడు. సీన్ కట్ చేస్తే అలా ఎగురుకుంటూ వెళ్లిన వారంతా ఒక్కసారిగా విజయనగరం వెళ్తారు. అక్కడ గోవింద బ్యాగ్ షాపులోకి వెళ్లి బ్యాగులు కొనుగోలు చేస్తారు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. హాలీవుడ్ సినిమాకి.. ఎక్కడ విజయనగరంలో ఉన్న గోవిందా బ్యాగుల షాప్ కు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. అక్కడే ఉంది అసలు మ్యాజిక్.. ఏంటంటే హాలీవుడ్ సినిమాలో ఉన్న ఒక దృశ్యాన్ని సేకరించి.. దానిని తన బ్యాగుల కంపెనీకి ప్రమోషన్ గా మార్చుకున్నాడు ఆ వ్యక్తి. పైగా సింక్ ఏమాత్రం మిస్ కాకుండా చదువుకుంటూ వచ్చాడు. ఈ వీడియో చూసిన వారందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు.. నవ్వు కూడా వస్తుంది. కాకపోతే ఈ వీడియోను ఈ స్థాయిలో ఆసక్తిగా రూపొందించడంలో ఆ షాప్ ఓనర్ విజయవంతమయ్యాడని చెప్పుకోవచ్చు. వాడకంలో ఇతడి తర్వాతే ఎవడైనా అనే భావన నెటిజన్ల లో కలుగుతోందంటే మామూలు విషయం కాదు. అన్నట్టు ఈ వీడియో ఇప్పటికే వేలల్లో వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాదు అదే స్థాయిలో కామెంట్స్ కూడా సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో యాడ్ రూపొందించిన తర్వాత మరి గోవింద బ్యాగుల కంపెనీ అమ్మకాలు ఎలా ఉన్నాయి? అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. కాకపోతే ఆ వీడియోలో అతడు చూపిస్తున్న దృశ్యాల ప్రకారం కచ్చితంగా అమ్మకాలు పెరిగే ఉంటాయని తెలుస్తోంది.
Orey last lo aa twist entraa pic.twitter.com/BYy1TzYKRC
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) June 23, 2025