Dhoni's 'Animal' ad
Dhoni’s ‘Animal’ ad : ఇండియన్ క్రికెటర్స్ లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు స్టేడియం దద్దరిల్లిపోతుంది. ప్రస్తుతం ఆయన IPL తప్ప అన్ని ఫార్మట్స్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. రేపటి నుండి IPL సీజన్ మొదలు కాబోతుంది. ధోని ప్రెజెన్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ధోని ’emotorad’ కి ఒక కమర్షియల్ యాడ్ చేసాడు. యానిమల్ మూవీ(Animal Movie) కి స్పూఫ్ గా తెరకెక్కిన ఈ యాడ్ కి సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వం వహించాడు. ధోని ని ఊహించని గెటప్ లో చూసేసరికి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మెంటలెక్కిపోయారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ వీడియో నే దర్శనం ఇచ్చేది.
Also Read : అదే ధోని విజయ రహస్యం.. సురేష్ రైనా
రీసెంట్ గా ఈ సైకిల్ CEO కునాల్ గుప్తా ఈ యాడ్ సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన 24 గంటలోపే ఈ యాడ్ కి 50 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఒక కమర్షియల్ యాడ్ కి ఈ స్థాయి వ్యూస్ రావడం అనేది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. స్టార్ హీరోల టీజర్స్, ట్రైలర్స్ కి ఈ స్థాయి వ్యూస్ రావడం వంటివి గతంలో మనం చూసాము. ఇప్పుడు ఒక కమర్షియల్ గా యాడ్ కి అలాంటి స్థాయి రెస్పాన్స్ రావడం చూస్తున్నాం. ధోని క్రేజ్ కి ఇది ఒక నిదర్శనం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం యూట్యూబ్ లోనే కాదు, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ యాడ్ వీడియో కి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. మళ్ళీ ఈ రేంజ్ చూడాలంటే ధోని వల్లనే సాధ్యం అని ఆయన అభిమానులు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ఈ ఆదివారం ముంబై ఇండియన్స్ తో చిదంబరం స్టేడియం లో జరగనుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. మరి మొదటి మ్యాచ్ లో ధోని క్రీజులోకి దిగుతాడా లేదా అనేది చూడాలి. గత IPL లో ఆయన ఆడిన మ్యాచులు తక్కువే అయ్యినప్పటికీ, ఆడిన కొద్ది మ్యాచులతోనే ఆయన మెరుపు దాడులు చేసాడు. అభిమానులకు ఇష్టమైన హెలికాఫ్టర్ షాట్స్ ఎన్నో కొట్టాడు. ఈసారి అంతకు మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : ‘యానిమల్’ అవతారం లో MS ధోని..ఇక సినిమాల్లోకి వచ్చేయొచ్చు!
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Dhonis animal ad 50 million views