Movie Reviews: క్రిటిక్స్.. సినిమాలను చూసి ఏమి బాగుంది ? ఏం బాగాలేదు ? ఎక్కడ పొరపాటు జరిగింది ? దర్శకుడు ఎక్కడ ఎలా తప్పు చేశాడు ? ఇలా ఒక సినిమాకు సంబంధించిన అన్ని అంశాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తూ చెప్పే వ్యక్తి. ఈ వ్యక్తుల కారణంగా సినిమాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎప్పటి నుంచో బలమైన ప్రచారం జరుగుతుంది. మరి ఈ సినిమా రివ్యూలు రాసేవారి వల్ల నిజంగానే నష్టం జరుగుతుందా ?

సరే.. నష్టమా ? లాభమా ? అనే విషయాలను పక్కన పెడదాం. ముందు ఒక సినిమాకి రివ్యూ రాయాలి అంటే ఏం కావాలి ? ఒక సినిమాకు రివ్యూ రాసేముందు దృష్టిలో పెట్టుకోవాల్సిన నియమాలు ఏమిటి ? అలాగే కనీస జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. ఒక సినిమా చూశాక, ముందు ఆ సినిమాకు సంబంధించి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, నిజాయితీగా చెప్పగలిగే ఆలోచనా విధానం ఉండాలి.
అలాగే సినిమా కథకు సంబంధించిన ఎటువంటి వివరణ ఇవ్వకూడదు. కానీ, కథలోని అంశాలను, అలాగే నేపథ్యాన్ని పాత్రల ప్రయాణానికి సంబంధించిన సన్నివేశాలను చెప్పడంలో తప్పులేదు. ఇక సినిమాలో ఏ ఏ డిపార్ట్మెంట్ ఎలా పని చేసిందన్న విషయాన్ని సవివరంగా, చక్కగా అర్ధమయ్యేలా వివరించగలగాలి. అదే విధంగా ఆ వివరణలో లాజిక్ ఉండాలి.
Also Read: మరో మూవీని కూడా ఓటీటీ లో రిలీజ్ చేయనున్న నిర్మాత సురేష్ బాబు… కారణం ఏంటంటే ?
అన్నిటికీ మించి సినిమాలో మెయిన్ పాయింట్ ఏమిటి ? ఆ పాయింట్ ను బాగా ఎలివేట్ చేశారా ? లేదా ? అలాగే సినిమా ప్లేలో మలుపులు ఉన్నాయా ? లేవా /ఒకవేళ మలుపులు ఉంటే.. ఆ మలుపుల కారణంగా ఆసక్తి పెరుగుతుందా ? లేదా ? ఇక సినిమాలో ఉన్న కమర్షియల్ అంశాలతో మంచి కామెడీ జనరేట్ అవుతుందా ? లేదా ? అనేది కూడా చూసుకోవాలి.
ఇవన్నీ చూసి తెలుసుకుని సినిమా రివ్యూ రాయాల్సి ఉంటుంది. లేకపోతే.. సినిమాకు అన్యాయం జరుగుతుంది. అందుకే, సినిమా రివ్యూలు రాసేవారికి ఒక టెక్స్ట్ పెట్టాలి. ఆ టెక్స్ట్ లో పాస్ అయిన వారు మాత్రమే సినిమా రివ్యూ రాయాలి, లేదు అంటే రాసే హక్కు లేదు అని ఒక కండిషన్ పెట్టాలి. అప్పుడే సినిమాలో బాగుపడతాయి.
Also Read: ఆ గాయం వల్ల 25 కుట్లు పడ్డాయని చెప్పిన హీరో షాహిద్ కపూర్…