Bellamkonda Sreenivas Yellamma movie : ‘బలగం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమెడియన్/ డైరెక్టర్ వేణు ఎల్లమ్మ(Yellamma movie) స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు, కానీ హీరోలే మారిపోతూ వస్తున్నారు. మొదట ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని తో చెయ్యాలని అనుకున్నారు. నాని కి స్టోరీ కూడా బాగా నచ్చింది, కానీ ఎందుకో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఆ తర్వాత ఈ చిత్రం నితిన్ చేతుల్లోకి వచ్చింది. ‘తమ్ముడు’ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా చేస్తానని నితిన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా నా కెరీర్ ని మలుపు తిప్పుతుందని, నటుడిగా తనని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని, ఇందులో నేను ఎంత అద్భుతంగా నటిస్తే, అంత పెద్ద హిట్ గా ఆ సినిమా నిలుస్తుందని, ఇలా ఎన్నో రకాల మాటలు చెప్పాడు. ఈ సినిమా మీద ఆయన భారీ ఆశలు కూడా పెట్టుకున్నాడు.
కానీ తమ్ముడు చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో నిర్మాత దిల్ రాజు నితిన్ తో మరో సినిమా చేయడానికి సాహసం చేయలేదు. దీంతో చాలా తేలికగా నితిన్ ని ఈ సినిమా నుండి తప్పించి, తమిళ హీరో కార్తీ డేట్స్ కోసం తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన డేట్స్ దొరకకపోవడం తో, రీసెంట్ గానే కిష్కిందకాండ సినిమాతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరో గా తీసుకున్నాడు దిల్ రాజు. ఛాలెంజింగ్ రోల్ అవ్వడం తో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా క్షణం ఆలోచించకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. హీరో విషయం కాసేపు పక్కన పెడితే, హీరోయిన్ ఎంపిక విషయం లో కూడా చాలా జాప్యం జరిగింది. ముందుగా సమంత డేట్స్ కోసం ప్రయత్నం చేశారు, కానీ ఆమె ఒప్పుకోలేదు.
ఆ తర్వాత కీర్తి సురేష్ డేట్స్ కోసం తెగ ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కుదర్లేదు. సాయి పల్లవి కోసం ప్రయత్నం చేశారు, రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడం తో దిల్ రాజు రిస్క్ చేయలేకపోయాడు. ఇప్పుడు చివరికి రష్మిక ఈ సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కథలో హీరో క్యారక్టర్ కి ఎంత స్కోప్ ఉంటుందో, హీరోయిన్ క్యారక్టర్ కి అంతకు మించిన స్కోప్ ఉంటుంది. అందుకే నటన పరంగా తమని తాము నిరూపించుకున్న హీరోయిన్స్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బట్టీ చూస్తుంటే ఈ సబ్జెక్టు ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మీదనే ఆధారపడి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇది గొప్ప అవకాశం. ఈ చిత్రం తో తనని తానూ ప్రూవ్ చేసుకుంటే వేరే లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి.