Jaya Janaki Nayaka: తెలుగు నుండి హిందీ లో డబ్ అయిన సినిమాలకు యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ రావడం ఈమధ్య కాలం లో సర్వసాధారణం అయిపోయింది. ఈ హిందీ డబ్బింగ్ ట్రెండ్ లో కింగ్ ప్రస్తుతానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన నటించిన ప్రతీ సినిమా హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వడం , వాటికి వందల మిలియన్ల వ్యూస్ రావడం సర్వ సాధారణం అయిపోయింది. ఇలాంటి రికార్డు వ్యూస్ రావడాన్ని చూసి , బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ లోకి ‘ఛత్రపతి’ రీమేక్ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది అనుకోండి , అది వేరే విషయం. అయితే రీసెంట్ గా బెల్లంకొండ నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రం వరల్డ్ రికార్డు ని నమోదు చేసింది.
పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీ లోకి డబ్ చేసి తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయగా, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1 బిలియన్ వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. అంటే అక్షరాలా వెయ్యి మిలియన్ల వ్యూస్ అన్నమాట. ఈ రేంజ్ వ్యూస్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా రాలేదు. ఆ అరుదైన రికార్డు బెల్లంకొండ కి మాత్రమే సాధ్యపడింది. భవిష్యత్తులో ఈ చిత్రం 2 బిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నిన్న ఒక్కరోజే ఈ చిత్రాన్ని 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టీ ఈ చిత్రాన్ని హిందీ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. 2017 , ఆగస్టు 11 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
కలెక్షన్స్ కూడా పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో వచ్చాయి. ‘లెజెండ్’ , ‘సరైనోడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన సినిమా ఇది. ఆ కారణం చేత , టాక్ కాస్త డివైడ్ గా వచ్చినప్పటికీ, ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు యావరేజ్ అనిపించుకుంది. ఇక టీవీ టెలికాస్ట్ లో ఈ చిత్రానికి ఊహించినంత రెస్పాన్స్ రాలేదు కానీ , హిందీ డబ్ వెర్షన్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని బహుశా మూవీ టీం కూడా ఊహించలేదు అని చెప్పొచ్చు. హిందీ వెర్షన్ అంటే కేవలం నార్త్ ఇండియన్ మాత్రమే కాదు , గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవాళ్ళతో పాటు , పాకిస్థాన్ , బాంగ్లాదేశ్ ఆడియన్స్ కూడా ఎగబడి చూస్తుంటారు. అందుకే మన తెలుగు హిందీ డబ్ వెర్షన్ సినిమాలకు ఈ రేంజ్ వ్యూస్ వస్తుంటాయి.
