https://oktelugu.com/

NTR And Koratala: కొరటాలకి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్న ఎన్టీయార్ ఎందుకంటే..?

ఎన్టీఆర్ ని బాగా వాడుకొని ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తీయబోతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా రెండు పార్టులు గా రాబోతుంది. కాబట్టి బాహుబలి, కే జి ఎఫ్ తరహాలోనే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించాలని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.

Written By: , Updated On : January 10, 2024 / 10:43 AM IST
NTR And Koratala

NTR And Koratala

Follow us on

NTR And Koratala: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను సాధిస్తూ ఉంటారు. అయితే వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ లను సాధించిన కొరటాల శివ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమాతో మాత్రం భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాతో ఆయన అంత గా ఢీలా పడటానికి కారణం ఏదైనా కూడా ఆయన దేవర సినిమాతో మళ్ళీ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర టీజర్ ని కనక మనం చూసినట్లయితే అందులో కొరటాల శివ ఎన్టీయార్ ని చూపించిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి.

ఇక ఎన్టీఆర్ ని బాగా వాడుకొని ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తీయబోతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా రెండు పార్టులు గా రాబోతుంది. కాబట్టి బాహుబలి, కే జి ఎఫ్ తరహాలోనే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించాలని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడని తెలుస్తుంది.

అయితే ఆచార్యతో మాత్రం కొరటాల చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. చిరంజీవి ని డీల్ చేసే విధానం కొరటాలకి రాలేదని, కొరటాల ఒక ఫ్లాప్ డైరెక్టర్ అని, కొరటాల పని అయిపోయింది అంటూ చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అయినప్పటికీ కూడా ఆయన దేనిమీద రెస్పాండ్ అవ్వకుండా కామ్ గా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆచార్య ఇచ్చిన ఫ్లాప్ నుంచి తొందరగానే తేరుకొని దేవర కథ మీద కూర్చోని దాన్ని పకడ్బందీ స్క్రిప్ట్ గా మలిచాడు. ఇక దాంతో ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ ఈ సినిమాతో ఎన్టీయార్ కి ఎలాగైనా సక్సెస్ ఇస్తాడు అనే ఉద్దేశ్యం తో ఎన్టీయార్ కొరటాల కోసం ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.అయితే అది ఏంటి అనేది ఎవరికి తెలియదు గానీ దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత కొరటాలకి ఒక భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా ఎన్టీయార్ తెలియజేసినట్టు గా టాక్ అయితే వస్తుంది. మరి అది ఏం గిఫ్ట్ అనేది ఎవరికీ తెలీదు గానీ మొత్తనికైతే భారీగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. అయితే ఈ సినిమా మీద తను పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టే తన సంతోషాన్ని సెట్ లో అలా తన కో ఆర్టిస్టులతో, డైరెక్టర్ తో ఎన్టీయార్ పంచుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…