Ariyana Glory: బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చింది అరియనా గ్లోరీ. సీజన్ 4 లో పాల్గొన్న అరియనా ఫైనల్ కి వెళ్ళింది. హౌస్లో అరియనా బోల్డ్ గేమ్ ఆడింది. ముక్కుసూటితనంతో ఆకట్టుకుంది. ఒక వారం నాగార్జున స్థానంలో హోస్టింగ్ చేసిన సమంత అరియనా పై ప్రశంసలు కురిపించింది. నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉందని కితాబు ఇచ్చింది. ఒక దశలో అరియనా టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం పొందింది. అభిజీత్, అఖిల్ సార్థక్, సోహైల్, అరియనా, అలేఖ్య హారిక ఫైనల్ కి వెళ్లారు. అరియనాకు 4వ స్థానం దక్కింది.
అరియనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి మరోసారి వార్తలకు ఎక్కింది. జిమ్ ఫిట్ లో వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై వర్మ కామెంట్స్ చేయడం కొసమెరుపు. అప్పట్లో వర్మ-అరియనా ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. ఈ మధ్య అరియనా లావైంది. దాంతో బాడీ షేమింగ్ కి గురైంది. లావైందని తనను విమర్శించిన వాళ్లకు అరియనా కౌంటర్ ఇచ్చింది.
ఇక బిగ్ బాస్ సీజన్ 7లో అరియనా కంటెస్టెంట్ అమర్ దీప్ ని సపోర్ట్ చేసింది. ఈ విషయంలో విమర్శలపాలైంది. అమర్ దీప్ మంచి ప్లేయర్ కాదు. అతనికి మేము ఓటు వేయమని అరియనా వీడియోల మీద కొందరు కామెంట్స్ చేశారు. అమర్ దీప్ యాంటీ ఫ్యాన్స్ అరియనాను ట్రోల్ చేశారు. ఎవరెంత ట్రోల్ చేసినా నేను అమర్ దీప్ కి సపోర్ట్ చేయకుండా ఉండను, అని అరియనా చెప్పుకొచ్చింది. టైటిల్ గెలవకున్నా రియల్ విన్నర్ అంటూ అరియనా అమర్ మీద ప్రేమను చాటుకుంది.
ఈ మధ్య సోషల్ మీడియాలో సందడి చేయడం ఎక్కువైంది. గ్లామర్ డోస్ పెంచిన అమ్మడు తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. అరియనా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజా కురచ చీరలో, నడుము అందాలు ప్రదర్శిస్తూ బోల్డ్ ఫోటో షూట్ చేసింది. అరియనా లుక్ మైండ్ బ్లాక్ చేస్తుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు అరియనా నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు రావడం లేదు. బుల్లితెర షోలలో మాత్రం కనిపిస్తుంది. ఆ మధ్య బీబీ జోడీలో కంటెస్ట్ చేసింది. అవినాష్-అరియనా ఒక జంటగా పాల్గొన్నారు. ఫైనల్ కి వెళ్లిన ఈ జంట తృటిలో టైటిల్ కోల్పోయారు. అరియనా అంతకంతకు తన పాపులారిటీ పెంచుకుంటుంది.
View this post on Instagram