https://oktelugu.com/

Shakeela : కోరిక తీరిస్తే నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తానన్న టాలీవుడ్ హీరో తండ్రి.. బయటపెట్టిన షకీలా!

కామెడీ సినిమాలతో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. అతని తండ్రి సత్యనారాయణ షకీలాని రూమ్ కి రమ్మని అందరి ముందే పిలిచాడని షకీలా చెప్పింది. తన కోరిక తీరిస్తే.. తర్వాత సినిమాలో ఛాన్స్ ఇస్తానని అతను అన్నారని ఆమె తెలిపారు.అయితే ఆ ఆఫర్ ని షకీలా తిరస్కరించిందట.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 5, 2024 / 02:33 PM IST

    Shakila

    Follow us on

    Shakeela : పరిచయం అక్కరల్లేని పేరు షకీలా. శృంగార తారగా ఎంతో మందిని అలరించిది. ఈమె అందానికి కేవలం కుర్రకారుని మాత్రమే కాకుండా.. ఎందరో ముసలి వాళ్లని కూడా తన అందం, నటనతో ఆకట్టుకుంది. షకీలా పేరు తెలియని వాళ్లు ఎవరు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా షకీలా పేరు పరిచయమే. అంతలా తన ఇమేజ్ ని సంబదించుకుంది. అయితే సినిమాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అన్ని దగ్గర కూడా ఇది తప్పదు. ప్రతి నటి కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటుంది. ఇలాంటిది ఉంటుందనే చాలా మంది అమ్మాయిలు సినిమాల్లోకి వెళ్లాడానికి భయపడుతున్నారు. అయితే ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో చాలా మంది నటీమణులు.. వాళ్లకు ఎదురైనా ఇలాంటి విషయాలను ఎప్పుడు మీడియా తో పంచుకుంటారు. అందులో హేమ కమిటీ నివేదిక విడుదల చేసిన తరువాత చాలా మంది సీనియర్ నటీమణులు వాళ్లు ఇబ్బందిపడిన సందర్భాలు చెప్పారు. అయితే షకీలా కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ తో ఇబ్బంది పడ్డారని తెలిపారు. టాలీవుడ్ హీరో తండ్రి ఆమెని రూమ్ కి పిలిచాడని షకీలా సంచలన విషయం చెప్పారు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో తండ్రి ఎవరో మరి చూద్దాం.

    కామెడీ సినిమాలతో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. అతని తండ్రి సత్యనారాయణ షకీలాని రూమ్ కి రమ్మని అందరి ముందే పిలిచాడని షకీలా చెప్పింది. తన కోరిక తీరిస్తే.. తర్వాత సినిమాలో ఛాన్స్ ఇస్తానని అతను అన్నారని ఆమె తెలిపారు.అయితే ఆ ఆఫర్ ని షకీలా తిరస్కరించిందట. తర్వాత అతనితో ఒక్క సినిమా కూడా చేయలేదట. అయితే ప్రస్తుతం సత్యనారాయణ లేరు. కానీ ఇది నిజమని ఆమె చెబుతున్నారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వల్ల చాలా మంది సినీ నటీమణులు వాళ్లు లైఫ్ లో ఇబ్బంది పడిన సంఘటనలు, లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. ఇన్ని రోజులు చెప్పని వాళ్లు కూడా ఇప్పుడు బయటికి వచ్చి.. ధైర్యంగా అందరి ముందు పేర్లు తో సహా చెబుతున్నారు. తన కెరీర్ ప్రారంభంలో షకీలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన సొంత తల్లి ఆమెని వ్యభిచారంలోకి తెచ్చిందని ఆమె ఎన్నో సార్లు బాధపడ్డారు. డబ్బులు కోసం తనని చాలా మంది దగ్గరికి పంపించిదని ఆమె తెలిపారు. ఇలా తన ఇంట్లో వాళ్ల చేత కూడా మోసపోయింది. చివరికి తన సోదరుడి చేతిలో కూడా మోసపోయింది. వాళ్లు తన డబ్బులు అన్ని తీసుకుని ఇంటి నుంచి గెంటేసారని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పింది.