BB Jodi Season 2: స్టార్ మా లో ‘బిబి జోడి సీజన్ 2’ షో చాలా రసవత్తరంగా సాగుతుంది… బిగ్ బాస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ తో ఈ బిబి జోడి షో నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. సీజన్ వన్ సక్సెస్ ఫుట్ గా పూర్తి కావడంతో సీజన్ 2 ను అంతే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సీజన్ 2 విషయంలో ఎవరు ఎలాంటి స్ట్రాటజీలను వ్యవహరిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకత్తిస్తుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఎత్తులను వేస్తూ ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారో ఈ బిబి జోడిలో కూడా అలాగే చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్ హౌస్ ను మించిపోయేలా ఈ షో లో వాళ్ల ఓవరాక్షన్ ఉంటుంది.
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎవరికి ఏమనిపిస్తే అది చేసేయడం బిబి జోడిని కొన్ని సందర్భాల్లో షో లో వాళ్ళను ముందుకు తీసుకెళ్తున్నప్పటికి, ఆ వల్గర్ లాంగ్వేజ్ సైతం వాళ్ళని కొంతవరకు వెనక్కి తీసుకొస్తుంది. ముఖ్యంగా రీతూ చౌదరి, డీమాన్ పవన్ లకు బిగ్ బాస్ హౌస్ లో మంచి క్రేజ్ రావడంతో వాళ్ళిద్దరిని కలిపి ఒక జోడిగా చేశారు.
వాళ్లు డాన్స్ చేయడం కంటే కూడా కాంట్రవర్సీ గొలిపే మాటలు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని ఆరాతీస్తూ దానిమీద సాగదీత వ్యవహారమైతే చేస్తున్నారు. దీనివల్ల వాళ్లకు కొంత వరకు ప్లస్ అవుతున్నప్పటికి అది చాలా వరకు మైనస్ అవుతుంది. ఇక నైనిక – అమర దీప్ లు కొంతవరకు వాళ్ళ డాన్స్ పర్ఫామెన్స్ లతో మెప్పిస్తున్నారు…సీత సైతం ప్రతి విషయాన్ని చాలా స్ట్రైట్ ఫార్వార్డ్ గా చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఏది ఏమైనా కూడా ఈ బిబి జోడి సీజన్ 2 లో విజేత ఎవరు అవుతారు అనే దానికన్నా ఈ ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయి వాళ్ళు కొట్టుకోవడాన్ని చూసి ఎలా ఎంజాయ్ చేద్దాం అనే రేంజ్ లోనే ప్రేక్షకులైతే ఎదురుచూస్తున్నారు… ఇప్పటికైనా కొట్టుకోవడం మానేసి పర్ఫామెన్స్ మీద ఫోకస్ పెడితే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు అందరికి ఉన్నాయి అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు…