Krithi Shetty: కింగ్ అక్కినేని నాగార్జున, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్ని నాయానా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వీరిద్దరూ… ప్రీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం… ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా, నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ కనిపించనుంది.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేసిన విషయం తెలిసిందే. కాగా పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అయితే తాజాగా సినిమాలో కృతిశెట్టి క్యారెక్టర్ ను రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. కాగా ఈ సినిమాలో కృతి “నాగలక్ష్మి” అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె ఫస్ట్ లుక్ ను నవంబర్ 18న ఉదయం 10:18 కు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
We will be revealing the first look of our Nagalakshmi from #Bangarraju on 18th November @ 10:18 am @iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @ZeeStudios_ pic.twitter.com/w6bresXeJv
— chaitanya akkineni (@chay_akkineni) November 16, 2021
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ‘లడ్డుండా’ అనే పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బంగార్రాజు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవర్ 15న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.