https://oktelugu.com/

ఎట్టకేలకు పట్టాలెక్కుతున్న నాగ్ ‘బంగార్రాజు’

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” మూవీ 2016 లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు నాగార్జున హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కింగ్ కెరీర్ మీద ఏర్పడిన అనుమాలన్నిటిని పటాపంచలు చేసింది. ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లో నటించాడు. అందులో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. Also Read: బ్రహ్మానందం పుట్టిన రోజు ప్రత్యేక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 1, 2021 / 04:50 PM IST
    Follow us on


    టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” మూవీ 2016 లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు నాగార్జున హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కింగ్ కెరీర్ మీద ఏర్పడిన అనుమాలన్నిటిని పటాపంచలు చేసింది. ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లో నటించాడు. అందులో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

    Also Read: బ్రహ్మానందం పుట్టిన రోజు ప్రత్యేక స్టోరీ

    ఆ ఊపులో సోగ్గాడే చిన్ని నాయ‌న ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తామని మేకర్స్ ప్రకటించటం జరిగింది. స్టోరీ రెడీ అవటానికి టైం పడుతున్న కారణంగా ఈ గ్యాప్ లో కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో “రారండోయ్‌ వేడుక చూద్దాం” సినిమా చేసి హిట్ సాధించాడు. ఆ తరువాత కథ ఓకే చేయించుకుని బంగార్రాజు స్టార్ట్ చేద్దామనుకున్నా బిగ్ బాస్ షో, వేరే సినిమాలు, మరికొన్ని కారణాల వలన ఇంతకాలం లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడన్నీ సెట్ కావటంతో ఈ మూవీని మొదలెట్టేందుకు సన్నాహాలు మొదలు పెట్టారని సమాచారం.

    Also Read: రాజమౌళికి సీనియర్ల పట్ల గౌరవం లేదట !

    ప్రస్తుతం అహిషోర్ సోలమన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాను చేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బంగార్రాజు సినిమా ఫిబ్రవరి రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానుందని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పార్ట్ లో కూడా నాగార్జున సరసన రమ్యకృష్ణ కొనసాగుతుందని, ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారట. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే మేకర్స్ నుండి అధికారక ప్రకటన రావాల్సిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్