Bandla Ganesh: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల వేళ అనుకోని ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ‘ప్రకాష్ రాజ్’ ప్యానెల్ నుంచి వైదొలిగి ఇండిపెండెంట్ గా ‘జనరల్ సెక్రటరీ’ పదవికి నామినేషన్ వేసి రెబల్ గా నిలబడ్డ ‘బండ్ల గణేష్’ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ గా జనరల్ సెక్రటరీ పదవికి ‘బండ్ల గణేష్’ నామినేషన్ దాఖలు చేశారు.
అయితే తాజాగా అనూహ్యంగా తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు ఉంటుందని ట్వీట్ చేశాడు. ‘ నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అని బండ్ల గణేష్ ట్విట్టర్ లో ప్రకటించారు.
మొదట ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేష్.. అనూహ్యంగా ఆ ప్యానెల్ నుంచి తప్పుకొని స్వతంత్రంగా బరిలోకి దిగారు. ప్రచారం కూడా చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తప్పుకోవడం విశేషం.
అయితే ‘నా దైవసమానులు.. నా ఆత్మీయుల’ సూచన మేరకు అని బండ్ల గణేష్ అనడాన్ని బట్టి బహుశా పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే వైదొలిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ‘రిపబ్లిక్’ వేడుకలో పవన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన సూచనతోనే వైదొలిగి బండ్ల గణేష్ కు మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
https://twitter.com/ganeshbandla/status/1443862947747418114?s=20