టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత హెచ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే కొత్త కోచ్ ఎవరన్న విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ ల పేర్తు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరో వపూ కుంబ్లే పేరును బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ప్రతిపాదించినప్పటికీ తనకు ఈ పదవిపై ఆసక్తి లేదని కుంబ్లే చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత జట్టు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్ కోచ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నా. రవి భాయ్ కోచ్ పదవి ముగిసిన తర్వాత ఎంఎస్ ధోని మెంటార్ గా, ద్రవిడ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నారని నా సహచర కామెంటేటర్లతో ఛాలెంజ్ చేశా. ఐపీఎల్ కామెంట్రీ చేస్తున్న సమయంలో ఈ విషయాలు చర్చకు వచ్చయని తెలిపాడు. కోచ్ గా ద్రవిడ్, మెంటార్ గా ధోని ఉంటే భారత్ క్రికెట్ కు అదొక వరంలా మారుతుంది. ఇద్దరూ కూల్ గా ఉంటారని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్, ధోనీ వీరిద్దూ చాలా కట్టపడతారు అని వీరి అధ్వర్యంలో భారత్ జట్టు అద్భుతంగా తయారవుతుందని తెలిపాడు.
అయితే ఇప్పుడు భారత్ జట్టులో అండర్ 21 కోచ్ గా ఉన్నప్పుడు అతని కింద అడిన వారేనని అన్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కు గతంలో కూడా బీసీసీఐ హెచ్ కోచ్ పదవికి రావాలని తెలిపింది. కానీ దానిని అతడు సున్నితంగా తిరస్కరించి తాను ఎన్సీఏ లోనే ఉంటానని తెలిపాడు. అలాగే ధోని కూడా కేవలం ఈ ఒక్క ప్రపంచకప్ కు మాత్రమే మెంటార్ గా వ్యవహరిస్తానని స్పష్టం చేశాడు.