Bandla Ganesh: విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే బండ్ల గణేష్ అప్పుడప్పుడు డీప్ మీనింగ్ పోస్ట్స్ కూడా చేస్తుంటాడు. వాటిని లోతుగా పరిశీలిస్తే కానీ అర్థం బోధపడదు. ఈ మధ్య దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే అసహనం ప్రదర్శిస్తున్న బండ్ల గణేష్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా చురక వేశాడనిపిస్తుంది. విషయంలోకి వెళితే… పూరి జగన్నాధ్-లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వివాదం నడుస్తుంది. లైగర్ డిజాస్టర్ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో నష్టపోయారు. నష్టాల్లో కొంత తిరిగి చెల్లించేందుకు లైగర్ దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ ఒప్పుకున్నారు.

మూవీ విడుదలై రెండు నెలలు దాటిపోతున్నా పూరి జగన్నాధ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. దీంతో వారు ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ధర్నాలు చేస్తే ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వనని చెప్పారు. ఈ వివాదంలో ఎంతో కొంత పూరి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. కొందరు ఆయనకు సప్పోర్ట్ చేస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో పూరి తనను సమర్ధించుకుంటూ ఒక సుదీర్ఘ లేఖ విడుదల చేశారు.
ఆ లేఖలో పూరి… నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. నా సినిమా బాగుంటుందని నమ్మి టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే మోసం చేశాను. వాళ్లకు నేను రుణపడి ఉన్నాను. మంచి సినిమా తీసి వాళ్ళ రుణం తీర్చుకుంటాను, అని పొందుపరిచాడు. ఈ సందేశాన్ని బండ్ల గణేష్ పూరి భార్యా కూతురుతో దిగిన ఫోటో పాటు ట్వీట్ చేశాడు. ఆ ఫోటో బండ్ల గణేష్ షేర్ చేయడానికి కారణం, కుటుంబాన్ని కూడా పూరి మోసం చేశాడని పరోక్షంగా చెప్పాడు అంటున్నారు.

చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అంటున్నారు. పూరి కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పూరి జగన్నాధ్ రాలేదు. డైలాగ్స్ చెప్పడం కూడా రాని వాళ్ళు హీరోలు చేసిన పూరి కొడుకును పట్టించుకోవడం లేదన్నాడు. లావణ్య వదిన(పూరి భార్య) దేవత,పూరి చేతిలో పైసా లేనప్పుడు ఆమె అండగా నిలిచింది. ఈ వ్యాంపులు(ఛార్మి) రాంప్ లు ఇప్పుడు వచ్చాయి అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు. తాను ఎవరినీ మోసం చేయలేదన్న పూరి వ్యాఖ్యలకు కౌంటర్ గా బండ్ల ఫ్యామిలీ ఫోటో షేర్ చేశాడు అంటున్నారు.