spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Assets: బండ్ల గణేష్ వల్ల పవన్ కళ్యాణ్ ఆస్తులు 10 రెట్లు పెరిగాయా..?...

Pawan Kalyan Assets: బండ్ల గణేష్ వల్ల పవన్ కళ్యాణ్ ఆస్తులు 10 రెట్లు పెరిగాయా..? ప్రస్తుతం పవర్ స్టార్ ఆస్తుల విలువ ఎంతంటే..?

Pawan Kalyan Assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్… మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు. 2014వ సంవత్సరంలో జనసేన అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి అడపదడప సినిమాలు మాత్రమే చేస్తున్నాడు… రాజకీయరంగం పైనే ఆయన పూర్తి ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. దాంతో ఆయన రాబోయే సినిమాల మీద భారీ ఎఫెక్ట్ పడుతున్నట్టుగా తెలుస్తుంది.

మిగతా హీరోలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ ఆస్తులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎక్కువగా సేవ కార్యక్రమాలను చేపడుతూ ఉంటాడు. కెరియర్ మొదటి నుంచి కూడా తనకు వచ్చిన రెమ్యునరేషన్ లో చాలా బాగం పేదలకు సహాయంగా ఇస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఆయనకి ఉన్న ఆస్తులను బట్టి చూస్తే ఆయనకి 1000 కోట్ల వరకు ఆస్తులైతే ఉంటాయట.

అది కూడా లాండ్స్, సైట్స్ మీదనే ఉండటం విశేషం… ఇక తనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా తక్కువగానే ఉంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో ఇంతకుముందు బండ్ల గణేష్ బాగా క్లోజ్ గా ఉండేవాడు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను తనే చూసుకునేవాడు.

అలా ఆయన క్లోజ్ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక సినిమా రెమ్యునరేషన్ వచ్చిందట. ఆ డబ్బులు తీసుకెళ్లి హైదరాబాద్ సిటీ ఔట్ కట్స్ లో కొని ల్యాండ్స్ అయితే ఇన్వెస్ట్ చేశాడట. దాంతో ఇప్పుడు ఆ లాండ్స్ విలువ విపరీతంగా పెరగడంతో బండ్ల గణేష్ వల్ల పవన్ కళ్యాణ్ ఆస్తులు అమాంతం పదిరెట్లు పెరిగాయంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version