Bandla Ganesh: బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ట్విట్టర్లో పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది ‘సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ సహనం, ఓర్పు ఎదురు తిరిగితే ప్రళయం పుడుతుంది’ అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారు అనేది నెటిజన్లలో చర్చ నడుస్తుంది.
బండ్ల గణేష్ ఎప్పుడు పవన్ స్మరణే చేసేవాడు.ఈ మధ్య కాలంలో మెగాస్టార్ పై అభిమానం పెరిగింది. బండ్ల గణేష్ కరోనా బారిన పడి ఎక్కడా ఆసుపత్రుల్లో బెడ్ దొరకని పరిస్థితుల్లో చిరంజీవి చొరవ తీసుకుని అపోలోలో చేరడంతో… తన ప్రాణాలు కాపాడిన దేవుడిగా చిరంజీవి చెప్పుకొస్తున్నారు. ‘మా’ ఎన్నికల సందర్భంగా ఇండస్ట్రీకి కొత్త పెద్ద అవసరమా అని అడిగితే… చిరంజీవి ఉండగా, ఇంకెవరూ అవసరం లేదని అన్నారు బండ్ల గణేష్.
మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన నేపథ్యంలో నరేష్, మోహన్ బాబు లాంటి వాళ్లు చిరంజీవిని ఉద్దేశించి ఇండైరెక్టుగా మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ తరుణంలో ‘‘ పోస్ట్ పోన్ మెంట్ ఈస్ నాట్ పనిష్మెంట్ ఇట్స్ అన్ ఎచీవ్ మెంట్ నౌ ఏ డేస్ ” అని ఇంకో పోస్ట్ పెట్టారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ… ఇది ఫోన్ ద్వారా షేర్ చేసిన ఒక కొటేషన్ మాత్రమే అని అన్నారు. ‘‘సహనం, ఓర్పు ఎదురు తిరిగితే ప్రళయం పుడుతుంది’’ అంటూ బండ్ల గణేష్ పరోక్షంగా అన్నట్లు తెలుస్తుంది.