Bandla Ganesh: బండ్ల గణేశ్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు కమెడియన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కూడా పేరు పొందారు బండ్ల. పొలిటికల్ గా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు హీరోగా ఒక చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. యశ్ రుషి బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్న ‘డేగల బాబ్జీ’ అనే సినిమాలో బండ్ల హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక్కటే చెప్పు సైజ్ 7) తమిళ సినిమాకు ఇది రీమేక్ వెర్షన్. పార్తిబన్ హీరోగా ఆయన దర్శక నిర్మాణం లోనే రూపొందిన సినిమా థియేటర్స్ లోనూ బాగా ఆడింది. ఈ చిత్రాన్ని పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ గుడ్ న్యూస్ ను హీరో బండ్ల గణేశ్ ప్రకటించారు.
ఈ మూవీ గురించి బండ్ల గణేశ్ ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు. “డేగల బాబ్జీ’ సినిమా డబ్బింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు తెలిపారు. డబ్బింగ్ రూమ్ లోని మానిటర్ లో తన విజువల్ రివీలయ్యే ఒక పిక్ ను ఆయన పోస్ట్ చేశారు. బ్లెస్ చేయండి అంటూ కేప్షన్ కూడా పెట్టడం విశేషం. చూడాలి మరి కమెడియన్ గా, సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ త్వరలో హీరోగా ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తారో. ఈ చిత్రంలో విశేషం ఏంటంటే ఇందులో ఒక్క పాత్రే ఉంటుంది అనే సమాచారం.