Aadhaar Hackathan: మన దేశంలోని ప్రజలకు యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్ కార్డులను జారీ చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే యూఐడీఏఐ ఆధార్ కార్డులను జారీ చేయడంతో పాటు వేర్వేరు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆయా కార్యక్రమాలలో విజేతలుగా నిలిచిన వాళ్లు బహుమతులను పొందే అవకాశం కూడా ఉంటుంది. యూఐడీఏఐ ప్రస్తుతం సులభంగా 3 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఆధార్ హ్యాకథాన్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన వాళ్లు ఈ మొత్తాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆధార్ హ్యాకథాన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేది వరకు రిజిష్టర్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ కాలేజ్ లకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ హ్యాకథాన్ లో పాల్గొనడానికి అర్హులు.
ఆధార్ కార్డులకు సంబంధించిన సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపించడమే ఈ హ్యాకథాన్ ను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి ఇందుకు సంబంధించిన ప్రకటన సైతం వెలువడింది. ఆధార్ హ్యాకథాన్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇందులో విజేతకు 3 లక్షల రూపాయలు లభించనుండగా రన్నర్ గా నిలిచిన వాళ్లకు 2 లక్షల రూపాయలు వస్తాయి.
ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ ను కూడా అందజేయడం జరుగుతుంది. ఆధార్ హ్యాకథాన్ లో నమోదు చేసుకోవాలంటే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ ఫారమ్ లో వివరాలను నమోదు చేయాలి. అందులో ఆధార్ నంబర్, కాలేజ్, యూనివర్సిటీ వివరాలను అప్ డేట్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చాను, వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మరి కొందరు సభ్యులు కూడా టీమ్ లో యాడ్ కావచ్చు. అయితే టీమ్ మెంబర్స్ అందరూ ఒకే కాలేజీకి చెందిన వాళ్లు అయ్యి ఉండాలి. ఆధార్ కార్డ్ ద్వారా నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించడంతో పాటు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ఈ బృందాలు అన్వేషించాల్సి ఉంటుంది.