Bandla Ganesh: కమెడియన్ గా, నిర్మాతగా ఆయనకు ఇండస్ట్రి లో బండ్ల గణేష్ కు మంచి పేరు ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల లోనూ, ఫంక్షన్ ల లోనూ ఆయన స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారంటే అతి శయోక్తి కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని చెప్పుకునే బండ్ల గణేశ్ … మెగా ఫ్యామిలి పై ఎంత ప్రేమ ఉంటుందో అందరికి తెలిసిందే. మెగా హీరోలపై ఎవరైన వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే.. బహిరంగంగానే ఇచ్చి పడేస్తాడు. అంతేకాదు సమయం దొరికితే చాలు మెగా హీరోలను, ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచేస్తాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… మళ్ళీ వార్తల్లో నిలిచారు బండ్ల గణేష్.

కాగా నిన్ననే యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కళాకారులకు ఏదైనా సహాయం చేయాల్సిందిగా యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేతకు మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశాడు. మెగాస్టార్ చిరంజీవి వినయంగా అడగడంతో చలించిపోయిన యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత… ‘మా’ మెంబర్స్ తో పాటు 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే వారందరికి తాము అందించే వైద్యంలో 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు.
https://twitter.com/ganeshbandla/status/1461206635804717056?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1461206635804717056%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fbandla-ganesh-interesting-tweet-chiranjeevi-1412946
అయితే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘మీరు సూపర్ సార్, మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా… నోట మాట రావడం లేదు’ అంటూ పోస్ట్ లో రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బండ్ల గణేష్ డేగల బాబ్జీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతుంది.