Bandla Ganesh Comments On Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా'(Telusu Kada Movie) బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది కానీ,ఇలాంటి డిఫరెంట్ సినిమాలను ఆదరించే ప్రేక్షకుల కారణంగా డీసెంట్ స్థాయిలో ఆడుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్,నైజాం లాంటి అర్బన్ సెంటర్స్ లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మరో వారం రోజుల ప్రామిసింగ్ థియేట్రికల్ రన్ ఉంటుంది అనే నమ్మకం రావడంతో అడ్వాన్స్ బేసిస్ మీద బిజినెస్ చేసిన ప్రతీ ఒక్కరు సేఫ్ అయినట్టే అని అంటున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్ కి బండ్ల గణేష్ ని కూడా ఒక అతిథి గా పిలిచారు మేకర్స్. ఈమధ్య కాలం లో బండ్ల గణేష్ ని ఇలాంటి ఈవెంట్స్ కి బాగా పిలుస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ఎలివేషన్స్ ఇస్తూ బాగా పాపులర్ అయిన గణేష్, పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ హీరో కి అదే తరహా ఎలివేషన్స్ ఇస్తాడని ఆ తర్వాతే అర్థం అయ్యింది. రీసెంట్ గా ఆయన ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ ఈవెంట్ లో ఇచ్చిన ప్రసంగం ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్మాత బన్నీ వాసు ని చిక్కుల్లో పెట్టే విధంగా ఆరోజు ఆయన మాటలు ఉన్నాయి. అందుకు బన్నీ వాసు కూడా బాధపడ్డాడు. ఇక నిన్న జరిగిన తెలుసు కదా సక్సెస్ మీట్ లో ‘లిటిల్ హార్ట్స్’ రేంజ్ ప్రసంగం ఇవ్వకపోయినా, గట్టిగా ఆడియన్స్ కి గుర్తుండిపోయే రేంజ్ ప్రసంగం అందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘డీజే టిల్లు సినిమాని చూసి సిద్దు ని నేను కేవలం వన్ డే వండర్ అని అనుకున్నాను. ఆ డైలాగ్స్, టైమింగ్ ఇవన్నీ కేవలం ఆ ఒక్క సినిమాకు మాత్రమే పరిమితం, దాని నుండి బయటకు రావడం కష్టం అని అనుకున్నాను. కానీ ‘తెలుసు కదా’ చూసిన తర్వాత నువ్వు ఒక గొప్ప నటుడివి అని అర్థమైంది. నీలో ఇలాంటి షేడ్ కూడా ఉందని చూపించి ఆడియన్స్ హృదయాలను దోచుకున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, కచ్చితంగా నువ్వు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ని రూల్ చేస్తావు. నువ్వు, తేజ సజ్జ లాంటి యంగ్ హీరోలను చూస్తుంటే, చాలా గర్వం గా ఉంది. ఇండస్ట్రీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని అర్థం అవుతుంది. రవితేజ లాంటి హీరో కి రీ ప్లేస్ గా రాబోయే రోజుల్లో ఎవరొస్తారో అని అనుకున్నాను. సిద్దు నువ్వు వచ్చావు, నువ్వు రవితేజ అంతటి వాడివి అవుతావు’ అని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.
Siddhu Jonnalagadda ఇండస్ట్రీ ని రూల్ చేస్తాడు..
లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో ఇలాంటి భజనకే పడద్దు అన్న బండ్ల.. just event change… #SiddhuJonnalagadda pic.twitter.com/C0UuCLLlyc
— M9 NEWS (@M9News_) October 22, 2025