Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మరికొన్ని రాశుల వారికి అనుకోకుండా లాభాలు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి వివాహం గురించి చర్చిస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాత్రి వారు తల్లిదండ్రుల మద్దతుతో పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండే అవకాశం ఉంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతతను కలిగి ఉంటారు..
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు చట్టపరమైన చిక్కులు ఉంటే అందులో నుంచి బయటపడతారు. ఉద్యోగం చేసే వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు గురువుల మద్దతు తీసుకునే అవసరం ఉంది. తల్లిదండ్రుల సహకారంతో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టిన వ్యాపారులు అదనపు లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఎవరికైనా డబ్బు ఇస్తే ఆలోచించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. తల్లిదండ్రుల అండతో కొందరు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. కార్యాలయాల్లో ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులో కొత్తగా మార్పులు చేస్తారు. ఉద్యోగులు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందడానికి కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురై అవకాశం ఉంది. ఇతరుల నుంచి శుభవార్తలు పొందే అవకాశం ఉంది. అయితే ఎవరితోనైనా వాదనలో ఉంటే జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు లాభాలను పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎంతోకాలంగా చూస్తున్న కొన్ని పనులు ఈరోజు పరిష్కారం అవుతాయి. వ్యాపారులతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సొంత వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు కీలకమైన రోజు అనుకోవచ్చు. గతంలో కంటే ఎప్పుడూ లాభాలు పొందుతారు. డబ్బు ఇతరులకు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. మధురమైన మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాల్సి వస్తే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో పనులన్నీ పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తలు అందుతాయి. పెద్దల సలహాతో వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొని విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారలో ఈరోజు అధిక లాభాలు పొందుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలాకాలంగా విభేదాలు ఉంటే అవి నేటితో తొలగిపోతాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. రోజువారి అవసరాలకు డబ్బు ఖర్చు అవుతుంది. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉండడంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా ఒప్పందాలు చేసుకోవడానికి వ్యాపారాలు ముందుకు వస్తారు. ఇవి భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. కుటుంబ సభ్యులు వ్యాపార ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. బ్యాంకు రుణం తీసుకోవాల్సి వస్తే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.