Viva Harsha Comments On Bandla Ganesh: దీపావళి కానుకగా విడుదలైన నాలుగు సినిమాల్లో ఒకటి ‘తెలుసు కదా'(Telusu Kada Movie). మొదటి రోజు ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చింది కానీ, ఆ తర్వాత నెమ్మదిగా టాక్ స్థిరపడి డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకుపోతోంది. ఈ చిత్రం సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవచ్చు కానీ, ఒక డిఫరెంట్ సినిమాని చేసాను అనే తృప్తి మాత్రం ఆయనకు ఇస్తుంది. కచ్చితంగా జాక్ చిత్రానికి మిగిలిన చేదు అనుభవాలు ఈ సినిమాకు మిగలవు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ గా కూడా అడ్వాన్స్ బేసిస్ మీద ఈ చిత్రానికి బిజినెస్ జరగడం తో ఎక్కువ నష్టాలు కూడా ఉండకపోవచ్చు. మిరాయ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఒక డీసెంట్ సినిమా పడింది అనుకోవచ్చు.
ఇకపోతే నిన్న ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరయ్యాడు. ఎప్పటి లాగానే మూవీ టీం కి మంచి ఎనర్జీ ఇచ్చే ప్రసంగాన్ని అందించాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ కి స్నేహితుడి క్యారక్టర్ చేసిన వైవా హర్ష గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో హీరో ఎంత సేపు కనిపిస్తాడో, వైవా హర్ష కూడా దాదాపుగా అంతసేపు కనిపిస్తాడు. చాలా కాలం తర్వాత ఆయనకు ఒక మంచి క్యారక్టర్ పడింది అనుకోవచ్చు. ఈ ఈవెంట్ కి నిన్న ఆయన కూడా విచ్చేశాడు. ఈ సందర్భంగా వైవా హర్ష మూవీ గురించి, అదే విధంగా అతిథి గా విచ్చేసిన బండ్ల గణేష్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
వైవా హర్ష మాట్లాడుతూ ‘ఈ ఈవెంట్ ప్రత్యేక అతిథి గా విచ్చేసిన బండ్ల గణేష్ గారికి ధన్యవాదాలు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో మీరు ఎప్పుడూ ముందు ఉంటారు. లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో మీరు మాట్లాడిన మాటలు ఆ మూవీ టీం కి ఎంతో ఎనర్జీ ని ఇచ్చాయి. ఎక్కడో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నాకు,’గోవిందుడు అందరివాడేలే’ చిత్రం ద్వారా మొట్టమొదటి సినిమా అవకాశం ఇచ్చింది బండ్ల గణేష్ గారే. ఆయన చేతుల మీదుగా నేను మొదటి చెక్ తీసుకున్నాను. ఇక నిర్మాత విశ్వ ప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలి. మీ సంస్థ కి PMF అని కాదు సార్, KNF అని మార్చండి. అంటే కళలను నిజం చేసే ఫ్యాక్టరీ అని. ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి, ఇండస్ట్రీ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు వైవా హర్ష.
షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నాకు ‘గోవిందుడు అందరివాడేలే’ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది బండ్ల గణేష్ గారు
నాకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చింది బండ్ల గణేష్ గారు
PMFని(People Media Factory) KNFగా(కలలని నిజం చేసే ఫ్యాక్టరీ) రీనేమ్ చేయాలి
‘తెలుసు కదా’ లో నా పాత్ర ఎవరికైనా వెళ్ళిపోద్దేమో అనే… pic.twitter.com/siUoe3bx4H
— Filmy Focus (@FilmyFocus) October 22, 2025