Band Melam Title Glimpse: కోర్ట్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్ష రోహన్ – శ్రీదేవి ఇద్దరు కలిసి చేస్తున్న ‘బ్యాండ్ మేళం’ సినిమా గ్లింప్స్ గత కొద్దిపాటి క్రితమే రిలీజ్ అయింది…ఇక ఈ గ్లింప్స్ చాలా ఫ్రెష్ ఫీల్ తో ఉంది…అలాగే తెలంగాణ బ్యాక్డ్రాప్ లో జరుగుతున్న స్టోరీ గా ఎస్టాబ్లిష్ చేశారు…అలాగే శ్రీదేవి నోట్లో నుంచి బూతులు రావడం నిజంగా చాలా సర్ప్రైజ్ అనే చెప్పాలి…మరి ఈ సినిమాను కోన వెంకట్ నిర్మిస్తున్నాడు…కాబట్టి ఈ సినిమాతో ఆయన మంచి ప్రొడ్యూసర్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
సతీష్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటి వరకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చిన కూడా ఈ సినిమా కి వచ్చే గుర్తింపు నెక్స్ట్ లెవల్ అంటూ సినిమా యూనిట్ మొత్తం మంచి కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే హర్ష – శ్రీదేవి జంట సైతం ఆన్ స్క్రీన్ మీద మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
కాబట్టి ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగే అవకాశం కూడా ఉంది…ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో హీరో మ్యూజిక్ కంపోజర్ అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తోంది…మరి ఈ సినిమాతో ఆయన ఒక గొప్ప విజయాన్ని సాధించినట్టైతే మరిన్ని యూత్ ఫుల్ సినిమాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాలతో చాలావరకు ఆసక్తి రేకెత్తిస్తున్నారు. కోన వెంకట్ ఈ మధ్యకాలంలో సినిమాలైతే ఏమి చేయడం లేదు.
మరి అలాంటి కోన వెంకట్ ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ఒరవడి క్రియేట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…