Chiranjeevi , Balayya
Chiranjeevi and Balayya : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథలో మరొక హీరో చేయడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోసం రాసుకున్న ఒక కథలో బాలయ్య బాబు చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య చిరంజీవిల మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. మొదటి నుంచి కూడా వీళ్ళ మధ్య మంచి పోటీ ఉన్నప్పటికీ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి మాత్రం ఇద్దరు చాలా కలిసి మెలిసి ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా కూడా ఇటు మెగా ఫ్యామిలీ, అటు నందమూరి ఫ్యామిలీ మధ్య సినిమాలపరంగా పోటీ అయితే ఉంటుంది. కానీ పర్సనల్ విషయాల్లో చాలా మంచి సన్నిహితులుగా ఉంటారనేది ఎప్పటికప్పుడు వాళ్లు ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో బాలయ్య హీరోగా వచ్చిన ‘భగవంతు కేసరి’ (Baghavanth Kesari) సినిమాని చిరంజీవి కోసం రాసుకున్నారట. అయితే చిరంజీవి కి మాత్రం ఆ కథ వినిపించలేదట…కారణం ఏంటంటే అప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య, భోళా శంకర సినిమాల్లో బిజీగా ఉండటం తో అనిల్ కి చిరంజీవి డేట్స్ దొరకవని అర్థం అయిపోయిందట.
ఇక దాంతో అతనికి బాలయ్య బాబు డేట్స్ దొరకడంతో బాలయ్య బాబుకి ఆ కథ వినిపించి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా ఒక కొత్త స్టైల్ లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి అంటే రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమాలు చేస్తాడని ఒక అపవాదు అయితే అతని మీద ఉంది.
మరి దాన్ని బీట్ చేస్తూ ఒకప్పటి చిరంజీవిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడనే చెప్పాలి… ఇక వచ్చే సంక్రాంతికి సైతం చిరంజీవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అతను మాటిచ్చాడు. తను అనుకున్నట్టుగానే ఆ సినిమాని సంక్రాంతి కానుకగా తీసుకొస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక చిరంజీవిని డైరెక్ట్ చేయాలనేది తన కలగా చాలా సందర్భాల్లో తెలియజేశాడు. మరి చిరంజీవి లాంటి స్టార్ హీరో దొరికితే మాత్రం అతను తన పూర్తి ఎఫర్ట్ పెడతానని ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చెప్పాడు. మరి తను అనుకున్నట్టుగానే చిరంజీవితో భారీ బడ్జెట్ సినిమాను తీసి సూపర్ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…