Balakrishna thriller movie: నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు బాలకృష్ణ…ఇప్పటివరకు తన ఎంటైర్ కెరియర్లో చేసిన సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడం విశేషం… అడపదడపా ప్రయోగాలు చేసినప్పటికి బాలయ్య కెరియర్లో 80% సినిమాలు మాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలే కావడం వల్ల అతనికి మాస్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టినవే కావడం విశేషం…బాలయ్య ఎప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అతని దగ్గరికి వచ్చే దర్శకులు మాత్రం కమర్షియల్ సినిమాలను చేద్దామనే దృక్పథంతోనే వస్తారు. ఇక వాళ్ల కోరిక మేరకు బాలయ్య కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఫస్ట్ టైం తన జానర్ ను మార్చి థ్రిల్లర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ ‘దృశ్యం’ సినిమాతో ఎలాంటి ఒక ఇంటెన్స్ డ్రామాను క్రియేట్ చేశాడో బాలయ్య బాబు సైతం అలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే బాలయ్య రాబోయే సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే కొంతమంది మలయాళం డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి హీరోలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.
ఇక ఆ క్రమంలోనే బాలయ్య సైతం డిఫరెంట్ సినిమాలను చేయాలనే దృక్పథంతో ఉన్నాడు. కాబట్టి జానర్ ని మార్చి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేయాలని చూస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే తన కూతురు అయిన తేజస్విని సైతం కథలను వింటుంది.
మరి ఆ కథల్లో ఏది ఫైనల్ అవుతుంది? మలయాళం డైరెక్టర్లలో ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు అనే విషయాలను కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు…చూడాలి మరి బాలయ్య జానర్ మార్చి సినిమా చేయబోతున్నాడు దాంతో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది…