Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu son debut: మహేష్ బాబు కొడుకును లాంచ్ చేసే బాధ్యతను ఆ దర్శకుడికి...

Mahesh Babu son debut: మహేష్ బాబు కొడుకును లాంచ్ చేసే బాధ్యతను ఆ దర్శకుడికి ఇవ్వబోతున్నారా..?

Mahesh Babu son debut: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన కెరియర్ మొదట్లో కొంతవరకు తడబడ్డప్పటికి ఒక్కడు సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబుకి లేడీ అభిమానులు ఎక్కువగా ఉంటారు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేనంత అందంగా మహేష్ బాబు ఉండడం అనేది అతనికి ప్రధానమైన […]

Mahesh Babu son debut: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన కెరియర్ మొదట్లో కొంతవరకు తడబడ్డప్పటికి ఒక్కడు సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబుకి లేడీ అభిమానులు ఎక్కువగా ఉంటారు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేనంత అందంగా మహేష్ బాబు ఉండడం అనేది అతనికి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. మొత్తానికైతే మహేష్ బాబు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న భారీ రికార్డు లను తిరగరాసే హీరోగా మారడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సత్తా చాటాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోతున్న ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తున్నాడు.

ఇక తన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ సైతం హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే తను అమెరికాలో యాక్టింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు తన కొడుకుని సైతం ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక తన కొడుకు మొదటి సినిమాని సందీప్ రెడ్డివంగ డైరెక్షన్ లో చేయించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తుంది… సందీప్ అయితే యూత్ కి అట్రాక్ట్ అయ్యే కాన్సెప్ట్ ని ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తాడు. కాబట్టి తన చేత గౌతమ్ ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తే తన కెరియర్ బాగుంటుందని మహేష్ బాబు భావిస్తున్నాడట.

మొత్తానికైతే మహేష్ బాబుతో సినిమా చేయాలనుకుంటున్నా సందీప్ రెడ్డి వంగకు మహేష్ తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను అప్పజెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక సందీప్ సైతం గౌతమ్ అతనికి దొరికితే అర్జున్ రెడ్డిని మించిన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తన సన్నిహితులు దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper