Balakrishna And Gopichand Malineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కొంతమంది చేసిన సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తుంది. అందులో ముఖ్యంగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన సినిమాలందరిని విశేషంగా అలరిస్తున్నాయి… ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి కమర్షియల్ గా ఆ సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించాయి. ప్రొడ్యూసర్ ను లాభాల పంట పండించాయి. అయితే ఆయన ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా విషయంలో స్క్రిప్ట్ మీద కొన్ని మార్పులు చేర్పులైతే జరుగుతున్నాయి… ఇక బాలయ్య బాబు సినిమాకు సంబంధించిన కథా చర్చలు మొత్తం తన చిన్న కూతురైన తేజస్విని చూసుకుంటుంది. ‘అఖండ 2’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తేజస్విని బాలయ్య బాబు సినిమాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
కారణమేంటి అంటే అతని నుంచి వచ్చే సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవాలే తప్ప ఫ్లాప్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో గోపీచంద్ మలినేని చెప్పిన కథలో కొన్ని కరెక్షన్స్ అయితే ఆమె చెప్పిందట… ఇక అవి బాలయ్య బాబు కు సైతం నచ్చడంతో ఆ చేంజెస్ చేయమని బాలయ్య గోపీచంద్ కి చెప్పాడు.
ఇప్పుడు ఆ మార్పులు చేయడానికి గోపీచంద్ తన టీం తో కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా చేంజెస్ మొత్తం పూర్తయిన తర్వాత మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది… బాలయ్య బాబు ఖాతాలో మరో సక్సెస్ పడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు షేక్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే సీనియర్ హీరోలు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెను సంచలనాలను క్రియేట్ చేస్తుండటం విశేషం… ముఖ్యంగా బాలయ్య బాబు సినిమాలకు వరుస సక్సెసులైతే దక్కుతున్నాయి…