Balayya – VV Vinayak : నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…కెరియర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలను చేస్తూ వచ్చిన ఆయన మాస్ హీరోగా ఎదగడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం కూడా ప్రతి ఒక్కరికి నచ్చింది. అందువల్లే బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి ఆయనకి ఇప్పటికీ భారీ ఇమేజ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు రాబోయే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక బాలయ్య బాబు ఎంత మంది దర్శకులతో సినిమాలను చేసినప్పటికి వివి వినాయక్ తో చేసిన చెన్నకేశవరెడ్డి (Chennakeshava Reddy) సినిమా అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ ని సాధించకపోయిన కూడా విమర్శకుల నుంచి బాలయ్య బాబు యాక్టింగ్ కి ప్రశంసలైతే దక్కాయి.
ఇక దాంతో పాటుగా సగటు ప్రేక్షకులను కూడా ఈ సినిమా మెప్పించింది. అయినప్పటికి ఈ సినిమా సక్సెస్ కాకపోవడం అనేది బాలయ్య అభిమానులను కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక వినాయక్ (Vinayak) – బాలయ్య బాబు (Balayya Babu) కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు.
Also Read : ‘గద’ కోసం బాలయ్య, బోయపాటి మధ్య మనస్పర్థలు..విషయం ఎంత దూరం వెళ్లిందంటే!
కారణం ఏంటి అంటే వివి వినాయక్ ఇతర స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండడం వల్ల బాలయ్య బాబు కూడా వినాయక్ తో మరో సినిమా ప్లాన్ చేయలేకపోయాడు. ఎప్పటికప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ వార్తలు వచ్చినప్పటికి వినాయక్ సైతం బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పటికి ఆ సిచువేషన్ అయితే క్రియేట్ అవ్వలేదు.
ఇద్దరు ఎవరికివారు ఎప్పటికప్పుడు వాళ్ళ సినిమాలతో బిజీగా ఉండడం వల్లే వీళ్ళ కాంబోలో సినిమా రాలేకపోయిందని చాలామంది సినిమా మేధావులు సైతం చెబుతూ ఉంటారు. నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా పడితే మాత్రం అది భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారి ఉండేదని మరి కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు…